వావ్.. పాకిస్తాన్ సెమిస్ చేరినట్లే?

praveen
ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగింది పాకిస్తాన్ జట్టు. బలమైన బౌలింగ్ విభాగం పటిష్టమైన బ్యాటింగ్ విభాగం ఉండడంతో పాకిస్తాన్ కి తిరుగు ఉండదు అని అందరూ అనుకున్నారు. ఇక వరల్డ్ కప్ లో గట్టి పోటీ ఇవ్వడమే కాదు అటు టైటిల్ విజేతగా నిలిచే ఛాన్సులు కూడా ఉన్నాయని ఎంతోమంది విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో పాకిస్తాన్ జట్టుకు మొదట్లోనే ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. మొదట చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ చేతిలో ఓటమి ఇక ఆ తర్వాత గెలుస్తుంది అనుకున్న జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమి ఫైనల్ అవకాశాలు కనుమరుగయ్యాయి.

 సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత కష్టంగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో వరుసగా భారీ విజయాలు సాధించిన పాకిస్తాన్ జట్టు సెమిస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఇప్పుడు ఇంటికి వెళుతుంది అనుకున్న పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఓటమి చవి చూసింది. దీంతో కేవలం ఐదు పాయింట్లతో మాత్రమే కొనసాగుతుంది  సౌత్ ఆఫ్రికా. తద్వారా ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచిందంటే నేరుగా సెమీఫైనల్ అడుగుపెడుతుంది.

 ఈ క్రమంలోనే ఇటీవలే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయి అటు పాకిస్తాన్ కు సెమీఫైనల్ చేరే అవకాశాలను మరింత సులభతరం చేయడంతో పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అటు పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంపై ఆశ్చర్య పోతున్నప్పటికీ.. ఇక ఓడిపోవడం మాకు మంచి జరిగింది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్ పై విజయం సాధించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: