ఏంటి.. పాకిస్తాన్ కాదు.. బంగ్లాదేశ్ సెమిస్ వెళ్తుందా?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సూపర్ 12 మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి అన్న విషయం తెలిసిందే. నేటితో ఇక వరల్డ్ కప్ లో లీగ్ దశ మ్యాచ్లకు తెరపడబోతుంది. తర్వాత సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమి ఫైనల్లో చోటు దక్కించుకున్నాయి. ఇక గ్రూప్-2 నుంచి ఎవరు సెమి ఫైనల్లో చోటు దక్కించుకుంటారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో ఇప్పటివరకు ఉన్న సమీకరణాలు మొత్తం మారిపోయాయి అని చెప్పాలి.

 ఇప్పటికే మెరుగైన రన్ రేట్ ఆరు పాయింట్లు సాధించి పాయింట్లు పట్టికలో టాప్ లో కొనసాగుతున్న ఇండియా సెమి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండవ స్థానం కోసం ప్రస్తుతం పోటీ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో పాకిస్తాన్ తప్పకుండా సెమి ఫైనల్లో అడుగుపెడుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ కు సెమీఫైనల్ కు వెళ్లేందుకు ఎన్ని చాన్స్ లు ఉన్నాయో అటు బంగ్లాదేశ్ కి కూడా అన్ని ఛాన్స్ లే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్లు పట్టికలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేరో నాలుగు పాయింట్లతో ఉన్నాయి.

 అయితే పాకిస్తాన్ తో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ రన్ రేట్ పరంగా మాత్రం కాస్త వెనుకబడి ఉంది. ఇకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే మొన్న పటిష్టమైన భారత్ నే గడగడలాడించింది బంగ్లాదేశ్. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కు గడ్డి పోటీ ఇవ్వడం ఖాయం అనేది తెలుస్తుంది. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా కాకుండా హోరాహోరీ పోరులో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది అంటే ఇక ఆరు పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ 4 పాయింట్స్ తోనే సరిపెట్టుకుంటుంది. దీంతో ఎవరు ఊహకందని విధంగా బంగ్లాదేశ్ సెమీఫైనల్ అవకాశాలను దక్కించుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: