భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. మళ్లీ జరగాలంటే?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని మ్యాచ్లు జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య జరగడానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు.. అందుకే కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే భారత్ పాకిస్తాన్ పోటీ పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇక చిరకాల ప్రత్యర్ధులుగా అంతర్జాతీయ క్రికెట్లో పిలవబడే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడు ఆసక్తికరంగానే మారిపోతూ ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ పోరుకు అటు అంతర్జాతీయ క్రికెట్లో రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

 ఇకపోతే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఈ దాయాదుల పోరును క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షించింది  నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఇలా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తో అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పొందిన క్రికెట్ ప్రపంచం మరోసారి ఈ పోరును చూడాలని ఎంతగానో ఆశపడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఇక అంతకంటే ఇంకేం కావాలి అని కోరుకుంటున్నారు అందరూ.

 ఇలా క్రికెట్ ప్రపంచం మొత్తం కోరుకుంటున్నట్లుగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే ముందుగా పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలి. ఇందుకోసం పాకిస్తాన్ తప్పకుండా బంగ్లాదేశ్ తో మ్యాచ్లో గెలవాలి. అంతేకాదు భారీ తేడాతో గెలిచి మంచి రన్ రేట్ కూడా సాధించాలి. దాంతో పాటు నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. ఇక ఇలా జరిగితేనే అటు పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుతుంది. మరోవైపు జింబాబ్వే భారత్ పై గెలవాలి. అప్పుడు భారత్ కూడా గ్రూప్ 2 నుంచి టాప్ లో నిలిచి సెమి ఫైనల్లో అడుగుపెడుతుంది. మరి రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్ లలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: