ఇండియా ఓడించిన జట్టుతో పాక్.. పాక్ ను ఓడించిన జట్టుతో భారత్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం అన్ని జట్లు కూడా సెమీఫైనల్ లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా గ్రూప్-2 లో ఉన్న భారత్, పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. ఒకరకంగా చూస్తే అటు పాకిస్తాన్తో పోల్చి చూస్తే భారత్ ఎంతో సునాయాసంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ ఇక ఒకవేళ ఇలా భారత్ సెమీఫైనల్కు చేరాలి అంటే మాత్రం జింబాబ్వే  తో జరిగిన మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సి ఉంది అని చెప్పాలి.

 అయితే మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను ఎంతో కష్టతరంగా మార్చుకున్న పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లలో మాత్రం భారీ తేడాతో విజయం సాధించి మళ్లీ సెమీస్ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం గ్రూప్ 2 లో పటిష్టమైన జట్లుగా ఉన్న భారత్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా చిన్న జట్టైనా నెదర్లాండ్స్ పై గెలిస్తే ఇక సెమి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

 ఇక అటు భారత్ పాకిస్తాన్ జట్లు మాత్రం ఆసక్తికర పోరు కొనసాగించబోతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే భారత్ చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది.. అదే సమయంలో ఏకంగా పాకిస్తాన్ ఓడించిన జింబాబ్వే జట్టుతో భారత్ చివరి మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా భారత్ నే ఓడించినంత పని చేసిన బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో పటిష్టమైన  పాకిస్తాన్ ని ఓడించిన జింబాబ్వేనూ భారత్ ఓడించాలి. రెండు జట్లకు గెలుపు ఎంతో ముఖ్యం. అందుకే ఈ మ్యాచ్లు కూడా ఆసక్తికరంగా మారబోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: