పొరపాటున జింబాబ్వే చేతిలో ఓడిందా.. ఇండియా పని గోవిందా?

praveen
గ్రూప్ 2 నుంచి సౌత్ ఆఫ్రికా, భారత్ జట్లు ఎలాంటి సమీకరణాలు లేకుండానే అటు సెమీఫైనల్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంటాయి అని అందరూ భావించారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోవడంతో ఈ రెండు జట్లకు తిరుగులేదు అని అనుకున్నారు. అలాంటి సమయంలోనే ఇక పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు భారీ విజయాలు సాధించింది. సౌత్ ఆఫ్రికా తో 36 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం గ్రూప్ 2లో సెమీఫైనల్ అవకాశాలు ఎంతగానో సంక్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి.. ఇటీవల పాకిస్తాన్ గెలుపుతో అప్పటి వరకు ఉన్న సమీకరణాలు అన్ని కూడా ఒక్కసారిగా మారిపోయాయి.

 అయితే చిన్న జట్టు అయినా  నెదర్లాండ్స్ తో పటిష్టమైన సౌతాఫ్రికా తర్వాత మ్యాచ్ ఆడుతూ ఉండడంతో.. ఇక సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ స్థానానికి ఎలాంటి డోకా లేదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు అసలు చిక్కు టీమిండియా కి వచ్చి పడింది. ప్రస్తుతం పాకిస్తాన్ 4 పాయింట్స్ తో ఉన్నప్పటికీ టీమిండియా కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో మ్యాచ్లో గెలిచింది అంటే ఇక రన్ రేట్ పరంగా మాత్రం టీమిండియా కంటే మెరుగైన స్థానంలోనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇక భారత్ సెమి ఫైనల్లోకి వెళ్లాలి అంటే మాత్రం జింబాబ్వేపై తప్పక గెలవాల్సి ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఒకవేళ భారత్ కనుక జింబాబ్వే చేతిలో పొరపాటున ఓడిపోయింది అంటే మాత్రం చివరికి పాకిస్తాన్ సెమీస్ కి భారత్ ఇంటికి వెళ్లడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే భారత్ కంటే పాకిస్తాన్ కి మెరుగైన రన్ రేటు ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ ఓడించిన జింబాబ్వేను ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ క్రమంలోనే ఇక భారత్ జింబాబ్వే మధ్య జరగబోయే పోరు ఎంతో ఆసక్తికరంగా రసవత్తరంగా మారబోతుంది అన్నది మాత్రం తెలుస్తోంది. ఏం జరగబోతుందో చూడాలి మరీ. ఇక భారత్ గెలుస్తుంది అనే ధీమలోనే ప్రస్తుతం టీమిండియా అభిమానులు అందరూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: