ఓరి దేవుడా.. సిగరెట్ ఇవ్వలేదని.. బెస్ట్ ఫ్రెండ్ నే చంపేశాడు?

praveen
ఈ సృష్టిలో అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే రక్తసంబంధం లేకపోయినా రక్తసంబంధీకుల కంటే  ఎక్కువగా తోడునీడగా ఉండేది స్నేహితుడే అని అంటూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు సొంతవాళ్లయిన తోడుగా ఉంటారో లేదో కానీ నేనున్నాను అనే మాత్రం స్నేహితుడు భరోసా ఇస్తూ ఉంటాడని గొప్ప గొప్ప పదాలు వాడుతూ ఉంటారు. ఇలా స్నేహం కంటే మిన్న ఇంకేది లేదు అంటారు ఎంతోమంది. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా అనే అందరూ అనుమాన పడుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఎందుకంటే చిన్న కారణానికే సమస్యల్లో అండగా నిలవాల్సిన స్నేహితుడే చివరికి ప్రాణాలు తీసేసాడు. ఈ ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సిటీకి చెందిన కఫ్తాన్ సింగ్ అనే 27 ఏళ్ల యువకుడు, సుహేల్ ఖాన్ ఇద్దరు కూడా స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరు ప్రాణ స్నేహితులుగా  బ్రతికేవారు. ఇక వీరిద్దరికీ కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. సాధారణంగా స్నేహితులు సిగరెట్ తాగుతున్నప్పుడు షేర్ చేసుకోవడం చూస్తూ ఉంటాం.

 ఇక ఎప్పటిలాగానే ఈ ఇద్దరు స్నేహితులు కూడా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఒక కోట వద్దకు చేరుకుని ఇక అక్కడ తాగడం మొదలుపెట్టారు. అయితే సుహేల్ ఖాన్ కఫ్తాన్ సింగ్ ను సిగరెట్ ఇవ్వాలంటూ అడిగాడు. కానీ అతను మాత్రం ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇక వీరిద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సుహేల్ ఖాన్ విచక్షణ మరచిపోయి స్నేహితుడైన కప్తాన్ సింగ్ ను కోట మీద నుంచి తోసేసాడు. 30 అడుగుల ఎత్తున కోట మీద నుంచి కింద పడిపోవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే గాయపడిన కఫ్తాన్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. దీనిపై ఇక మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: