పుట్టింది సౌత్ ఆఫ్రికా.. నెదర్లాండ్స్ జట్టులో ఆడి.. ఇప్పుడు కివీస్ తరఫున?

praveen
సాధారణంగా క్రికెట్ అనే ప్రొఫెషన్ లోకి అడుగుపెట్టిన ఆటగాడు ఎవరైనా సరే తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి అని భావిస్తూ ఉంటాడు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఇక జీవితంలో అంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు అని ఎంతో మంది భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనే కళతోనే బ్రతుకుతూ చివరికి ఆ కలను సహకారం చేసుకుంటారు.. మరి కొంతమంది ఒక దేశం తరపున కాదు ఏకంగా రెండు దేశాల జాతీయ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాలను కూడా దక్కించుకుంటూ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇటీవలే న్యూజిలాండ్ క్రికెటర్ మైకేల్ రిప్పన్ కూడా ఇలాంటి ఒక అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా రెండు దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ నెదర్లాండ్స్ జట్టు తరఫున క్రికెట్ ఆడాడు మైఖేల్ రిప్పన్. అయితే ఈ రెండు దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించిన మైకేల్ రిప్పన్ స్వతహాగా సౌత్ ఆఫ్రికా వాసి కావడం గమనార్హం. సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు మైఖేల్ రిప్పన్. అయితే అతని కుటుంబం అతని చిన్నతనంలోనే నెదర్లాండ్స్ వెళ్లి అక్కడే సెటిల్ అయింది. దీంతో నెదర్లాండ్స్ లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు.

 2012లో తొలిసారి కౌంటింగ్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు.. 2013లో నెదర్లాండ్స్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 9 వన్డేలు 18 టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు మైఖేల్ రిప్పన్. ఈ క్రమంలోనే స్కాట్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ జట్టు తరఫున డెబ్ల్యూ మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి. ఇలా ఏకకాలంలో రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్ గా టి20 క్రికెట్లో రెండు దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించిన 14వ క్రికెటర్ గా మైకల్ రిపేర్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: