కోహ్లీ రిటైర్ అవ్వాలి.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ఆసియా కప్ ముందు వరకు కూడా నిలకడ లేమితో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇక ఆసియా కప్ చివర్లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టి20 కెరియర్ లోనే మొదటి సెంచరీ సాధించి తన పూర్వవైభవాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే ఫామ్ కొనసాగిస్తూ వరల్డ్ కప్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాలు మధ్య పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించి విలువైన ఇన్నింగ్స్ ఆడి తానేంటో, తన ఆట ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

 తనపై వస్తున్న విమర్శలకు ఏకంగా బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆడిన విరోచిత ఇన్నింగ్స్ పై అంతర్జాతీయ క్రికెట్లో ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి  కోహ్లీ రానున్న రోజుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే బాగుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 మ్యాచ్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి.. కాకపోతే ఇండియా మనకంటే అద్భుతంగా ఆడింది. ఈ టోర్నీలో ఇంకా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ తప్పక మరోసారి తలబడతాయి అప్పుడు పాకిస్తాన్కు అవకాశం ఉంటుంది. ఇక 53 బంతుల్లో 82 పరుగులు చేసి భారత్ ను గెలిపించిన కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతం.. పట్టుదలగా ఆడితే మనం ఏంటో నిరూపించుకోవచ్చు.. కోహ్లీ చేస్తుంది అదే ఇక తనపై అతనికి ఉన్న నమ్మకమే అతని విజయానికి కారణం అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ టి20ల నుంచి రిటైర్ అయితే బాగుంటుందని నేను భావిస్తున్న.. ఎందుకంటే తన శక్తి సామర్థ్యాలను టి20 లకే చేయకూడదు.. ఇటీవల పాకిస్తాన్తో మ్యాచ్లో చెలరేగినట్లుగానే వన్డేలో కూడా ఆడాలి అంటూ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: