వరల్డ్ కప్ లో ఓటమి బాధతో హెడ్ కోచ్ రాజీనామా !

VAMSI
క్రికెట్ లో ఏ దేశానికి అయినా వరల్డ్ కప్ సాధించడం అన్నది కలగా ఉంటుంది. ఆ దిశగా ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్ మరియు సహాయక సిబ్బంది టోర్నీ ముందు వరకు చాలా కష్టపడతారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అందరికన్నా ఎక్కువ ఒత్తిడి జట్టు హెడ్ కోచ్ మీదనే ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిచినా ఓడినా అంతా బాధ్యత కోచ్ దే అవుతుంది. ఇప్పుడు అదే చందంగా వెస్ట్ ఇండీస్ జట్టు ఎన్నో ఆశలతో టీ 20 వరల్డ్ కప్ 2022 లోకి అడుగు పెట్టింది. మెయిన్ డ్రా కు అర్హత సాధించని కారణంగా, అర్హత మ్యాచ్ లను ఆడాల్సి వచ్చింది . వెస్ట్ ఇండీస్, జింబాబ్వే, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ లతో కూడిన గ్రూప్ లో పోటీ పడింది.
కానీ దురదృష్టవశాత్తూ ఆడిన మొదటి మ్యాచ్ లోనే స్కాట్లాండ్ లాంటి చిన్న జట్టుతో ఓడిపోయింది. దీనితో మిగిలిన రెండు మ్యాచ్ లను గెలవాల్సిన పరిస్థితి. రెండవ మ్యాచ్ జింబాబ్వే తో గెలిచింది, కానీ ఆఖరి మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలయింది. దీనితో మూడింటిలో ఒకటే గెలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు ఏకంగా టోర్నీ నుండి నిష్క్రమించింది. రెండు మ్యాచ్ లను గెలుచుకున్న జింబాబ్వే మరియు ఐర్లాండ్ జట్లు సూపర్ 12 కు అర్హత సాధించాయి. ఇలా వరల్డ్ కప్ లో డైజెస్టర్ గా ఆడిన వెస్ట్ ఇండీస్ జట్టు పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ఈ ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ హెడ్ కోచ్ గా ఉన్న ఫిల్ సిమ్మన్స్ సమాధానం చెప్పాల్సి ఉంది.
అందుకే అతను ఒక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన నిర్ణయాన్ని కాసేపటి క్రితమే తెలియచేశాడు. ఆఖరిగా ఫీల్ సిమ్మన్స్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు ఆస్ట్రేలియా తో జరగనున్న 2 టెస్ట్ ల సిరీస్ అనంతరం జట్టుకు దూరం కానున్నాడు.    
     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: