"ఆస్ట్రేలియా - కివీస్" మ్యాచ్... టఫ్ ఫైట్ తప్పదా ?

VAMSI
నిన్న మధ్యాహ్నం ముగిసిన జింబాబ్వే మరియు స్కాట్లాండ్ మ్యాచ్ తో సూపర్ 12 అర్హత మ్యాచ్ లు ముగిశాయి. అర్హత రౌండ్ లో మొత్తం ఎనిమిది టీం లు పోటీ పడగా నాలుగు మాత్రమే తర్వాత రౌండ్ కు అర్హత సాధించాయి. ఈ రోజు నుండి సూపర్ 12 మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ గత టీ 20 వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా మరియు రన్నర్ అప్ న్యూజిలాండ్ మధ్యన సిడ్నీ వేదికగా మ్యాచ్ జరగనుంది. గత వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ ఈ సారి ఎలాగైనా తమ చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని ఎంతో కసిగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు అవకాశాలు ఎవరికీ ఎక్కువ ఉన్నాయన్నది ఊహించలేని పరిస్థితి.
ఎందుకంటే పొట్టి ఫార్మాట్ లో రెండు జట్లు కూడా అసాధారణమైన ఆటతీరును కనబరుస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఫేవర్ గా ఉండనుంది. అయినప్పటికీ కివీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. తమదైన రోజున ప్రత్యర్థి ఎవరైనా ఓటమి రుచి చూడాల్సిందే. ఆస్ట్రేలియా టీం లో బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. జోష్ హాజిల్ వుడ్, స్టార్క్ మరియు కమిన్స్ లతో కూడిన బలమైన పేస్ అటాక్ ఉంది.. ఇక స్పిన్ తో ఎంతటి బ్యాట్స్మన్ ను అయినా తన వలలో వేసుకునే ఆడం జంపా ఎలాగూ ఉన్నాడు.
కివీస్ కు ఈ బౌలింగ్ అటాక్ ను తట్టుకుని పరుగులు చేయడం అంటే మాములు విషయం కాదు. పవర్ ప్లే లో వికెట్లు కోల్పోకుండా ఆడితే తర్వాత అటాక్ చేయగలిగే ఆటగాళ్లు కివీస్ లో ఉన్నారు. కివీస్ లో కాన్ వే, విలియమ్సన్, ఫిలిప్స్ మరియు నీషం లు కీలకం కానున్నారు. బౌలింగ్ లో సౌథీ అనుభవం వీరికి చాలా బాగా ఉపయోగపడనుంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో రెండు జట్లు టఫ్ ఫైట్ ఇస్తారని అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: