స్టన్నింగ్ క్యాచ్.. బాడీలో స్ప్రింగ్ లు ఉన్నట్టున్నాయి?

praveen
ఇటీవలె వరల్డ్ కప్ లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్లు జరిగాయి. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా ఎంత ఉత్కంఠ భరితంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి మెరుపు ఫీల్డింగ్, మెరుపు బ్యాటింగ్, మెరుపు బౌలింగ్.. ఇలా ప్రతి మ్యాచ్ లో కూడా ప్రేక్షకులకు కావాల్సిన మెరుపులు కనిపించాయి అని చెప్పాలి.  ఇక ఇటీవల క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా స్కాట్లాండ్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన జింబాబ్వే జట్టు దాదాపు 15 ఏళ్ల టి20 ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించింది అని చెప్పాలి.

 స్కాట్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగింది స్కాట్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 20వ ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి టార్గెట్ చేదించింది అని చెప్పాలి. ఇలా లీగ్ దశలో ఐర్లాండ్ పై నెగ్గి.. ఆ తర్వాత వెస్టిండీస్ చేతిలో ఓడిన జింబాబ్వే కీలకమైన పోరులో విజయం సాధించి ఇక సూపర్ 12 కు అర్హత సాధించింది. ఇక చివరికి స్కాట్లాండ్ మాత్రం పేలవ ప్రదర్శనతో ఇంటి బాట పట్టింది అని చెప్పాలి.

 ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఒక స్టన్నింగ్ క్యాచ్ మాత్రం ప్రేక్షకుల మనసులు దోచేసింది. జింబాబ్వే ఆటగాడు వెస్లీ మాదే వేరా అద్భుతమైన క్యాష్ తో మెరిసాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బాటర్ మాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాష్ ని వెస్లీ మాదే వేరా గాల్లోకి ఎగిరి ఎంతో అద్భుతంగా అందుకున్నాడు. అతను క్యాచ్ పట్టిన తీరు చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఐసిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు అతని బాడీలో స్ప్రింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: