నరైన్ & రస్సెల్ లను తీసుకోకుండా వెస్ట్ ఇండీస్ తప్పు చేసిందా ?

VAMSI
పొట్టి వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 జట్లు కప్ కోసం పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పుడు కేవలం క్వాలిఫైయర్ మ్యాచ్ లు మాత్రమే జరుగుతున్నాయి. గతంలో టీ 20 వరల్డ్ కప్ ను రెండు సార్లు సాధించిన జట్టు వెస్ట్ ఇండీస్ కూడా ఇప్పుడు క్వాలిఫైయర్ ఆడుతోంది. ఈ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుంది అనేది ఊహించలేము. అలా రెండు సార్లు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సూపర్ 12 కు చేరడానికి పడడానికి చిన్న చిన్న క్రికెట్ దేశాలతో పోటీ పడలసిన పరిస్థితి వచ్చింది.
వెస్ట్ ఇండీస్, ఐర్లాండ్ , స్కాట్లాండ్ మరియు జింబాబ్వేలో ఒక గ్రూప్ లో ఉన్నాయి. కాగా వెస్ట్ ఇండీస్ ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలయింది. దీనితో వెస్ట్ ఇండీస్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టీమ్ కు కీపర్ మరియు విధ్వంసకర బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ కెప్టెన్ గా ఉన్నాడు. కాగా మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా వెస్ట్ ఇండీస్ జట్టు ఎంపిక గురించి కూడా ఒక విషయం వైరల్ అవుతోంది.
వరల్డ్ కప్ కు యాజమాన్యం జట్టును ఎంపిక చేశాక...చూస్తే అందులో ఆల్ రౌండర్ లు అయిన అండ్రీ రస్సెల్ మరియు సునీల్ నరైన్ లను ఎంపిక చేయలేదు. దీనితో ఇరువురి అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకులు షాక్ కు గురయ్యారు. అయితే గతంలో బోర్డ్ కు వీరికి మధ్యన వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే టీ 20 మ్యాచ్ లో ఆల్  రౌండర్ లు జట్టులో ఉండడం చాలా అవసరం. అంతే కాకుండా వీరిద్దరూ ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థులు. అయితే వీరిని సెలెక్ట్ చేయకుండా వెస్ట్ ఇండీస్ జట్టు యాజమాన్యం తప్పు చేసిందని క్రీకెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: