టీ 20 వరల్డ్ కప్ 2022: శ్రీలంక సూపర్ 12 కు అర్హత సాధిస్తుందా ?

VAMSI
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ 2022 లో ఇప్పటికే క్వాలిఫై అయిన 8 జట్లు వార్మ్ అప్ గేమ్స్ ఆడుతుంటే, సూపర్ 12 లో ఖాళీగా ఉన్న మరొక్క నాలుగు స్థానాల కోసం ఎనిమిది జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. అందులో ఒక గ్రూప్ లో వెస్ట్ ఇండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు జింబాబ్వే లు ఉండగా, మరో గ్రూప్ లో శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్ మరియు యూఏఈ లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుండి ఒక్కో టీమ్ మూడు మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే శ్రీలంక గ్రూప్ కి అన్ని జట్లు రెండు మ్యాచ్ పూర్తి చేసుకున్నాయి. అందులో శ్రీలంక మరియు నమీబియా కు ఒక్కో మ్యాచ్ గెలవగా , నెదర్లాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి క్వాలిఫికేషన్ కు దగ్గరలో ఉంది.
ఇక యూఏఈ మాత్రం ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి వరల్డ్ కప్ నుండి అనధికారికంగా తప్పుకుంది. అయితే మిగిలిన వాటికి ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆసియా కప్ 2022 లో ఛాంపియన్ గా నిలిచిన శ్రీలంక జట్టుకు సూపర్ 12 కు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు లంక అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే .. ఈ రోజు యూఏఈ పై భారీ తేడాతో గెలవడం నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది అని చెప్పాలి. కానీ లంక లాగే ఒకే మ్యాచ్ గెలిచిన నమీబియా కన్నా తక్కువ రన్ రేట్ ను కలిగి ఉండడం ఒక్కటే ప్రతికూలంగా మారనుంది.
అయితే నమీబియా తన తర్వాత మ్యాచ్ లో యూఏఈ తో ఓడిపోయి.. నెథర్లాండ్స్ తో మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే రన్ రేట్ తో సంబంధం లేకుండా సూపర్ 12 కు నెదర్లాండ్ మరియు శ్రీలంక లు అర్హత సాధిస్తాయి. అలా కాకుండా శ్రీలంక తో నెదర్లాండ్ గెలిచి..  యూఏఈ తో నమీబియా గెలిస్తే శ్రీలంక సూపర్ 12 కు చేరదు. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే నెక్స్ట్ మ్యాచ్ లు జరిగే వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: