యూఏఈ ఆల్ రౌండర్.. అరుదైన ప్రపంచ రికార్డ్?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరూ ఊహించిన దానికంటే టి20 వరల్డ్ లో భాగంగా మొదటి రోజు మ్యాచ్ లలోనే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందింది అని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న శ్రీలంకను పసికూన నమీబియా  జట్టు ఓడించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇక ఆ తర్వాత యూఏఈ, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగానే చివరి బంతి వరకు హోరా హోరీగా జరిగింది అని చెప్పాలి. దీంతో మొదటి రోజే రెండు మ్యాచ్లు కూడా పైసా వసూల్ మ్యాచ్లుగా మారిపోయాయి. ఇలా వరల్డ్ కప్ లో తొలిరోజే సంచలనాల మూత మోగింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే యూఏఈ నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా ఒక అరుదైన ప్రపంచ రికార్డు నమోదయింది అని చెప్పాలి. యూఏఈ ఆటగాడు అయాన్ అఫ్జల్ ఖాన్ టి20 వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. కాగా యూఏఈ ఆల్ రౌండర్ అయాన్ వయసు పదహారేళ్ల 335 రోజులు మాత్రమే కావడం గమనార్హం. ఇంత చిన్న వయసులో ప్రపంచ కప్ ఆడి రికార్డుల్లోకి ఎక్కాడు ఈ యువ ఆల్రౌండర్.  అయితే గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ అమీర్ పేరిట ఉండేది. మహమ్మద్ అమీర్ 17 ఏళ్ల 55 రోజుల వయసులో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడగా ఇక ఇప్పుడు ఆ రికార్డును అయాన్ బద్దలు కొట్టాడు.

 ఇక అమీర్ తర్వాత అత్యంత పిన్నవ వయసులో వరల్డ్ కప్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షబాద్ 17 ఏళ్ల 196 రోజులు, ఐర్లాండ్ ప్లేయర్ జార్జ్ డాక్రీల్ 17 ఏళ్ల 282 రోజుల వయసులో ప్రపంచకప్ ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు. ఇక వరల్డ్ కప్ లో అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడి విషయం కొస్తే.. నెదర్లాండ్స్ జట్టు ఆటగాడు స్టెఫాన్  మై బుర్గ్ అరుదైన ఘనత సాధించాడు. 38 ఏళ్ళ 230 రోజుల వయసులో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇలా అతిపిన్న వయసు కలిగిన ఆటగాడు అతి పెద్ద వయసు కలిగిన ఆటగాడు ఒకే మ్యాచ్లో ఎదురు పడటం గమనార్హం.  కాగా యూఏఈ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ విజయం సాధించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: