నేడే మూడో వన్డే.. ఇరు జట్లకు డు ఆర్ డై?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న మూడో వన్డే మ్యాచ్ జరగడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో విజయం సాధించింది టీమిండియా. ఇప్పుడు వరల్డ్ కప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు అటు ఆస్ట్రేలియాకు పయనం అయినా నేపథ్యంలో  ఇక ఇప్పుడు యువ ఆటగాళ్లతో అటు సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ లో తలబడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా రెండవ వన్డే మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇకపోతే నేడు జరగబోయే మూడో వన్డే మ్యాచ్ అటు నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మారిపోయింది. మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా చేరో మ్యాచ్ లో విజయం సాధించడంతో ఒకటి ఒకటితో సమంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు పై చేయి సాధించి విజయం సాధిస్తే ఇక వారిదే వన్డే సిరీస్ అన్నట్లుగా మారిపోతుంది. అయితే ఇప్పటికే  టి20 సిరీస్ గెలిచి జోరు మీద ఉన్న టీమిండియ వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. రెండవ వన్డే మ్యాచ్ లో మంచి ప్రదర్శన నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండానే బరులోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

 అదే సమయంలో అటు భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికా జట్టు కనీసం వన్డే సిరీస్ లో అయినా విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కసితో బలిలోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠ భరితంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇక మ్యాచ్ పూర్తిస్థాయిలో జరుగుతుందా లేకపోతే వర్షం కారణంగా ఆటంకం కలిగితే ఓవర్లను కుదిస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: