నేడే రెండో టి20.. టీమిండియా తిప్పేస్తుందా?

praveen
టి20 వరల్డ్ కప్ కి కొన్ని రోజుల ముందు అటు టీమ్ ఇండియా వరుసగా టి20 సిరీస్ లు ఆడుతుంది  మొన్నటికి మొన్న భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడిన టీమ్ ఇండియా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై రెండు విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కూడా అదే జోరును కొనసాగించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది.

 తద్వారా మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ప్రస్తుతం 1-0  తేడాతో టీమ్ ఇండియా ఆదిక్యంలో  కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక రెండవ టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే నేడు రెండవ టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసింది. గౌహతి వేదికగా జరగబోయే రెండవ టి20 మ్యాచ్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్లు తలబడబోతున్నాయి. అయితే మొదటి మ్యాచ్ లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా రెండవ టి20 మ్యాచ్ లో బాగా రానించి విజయం సాధించాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంది.

 అయితే రెండవ టి20 లో సౌత్ ఆఫ్రికా గెలిస్తేనే ఆ జట్టుకు ఇంకా సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఒకరు సిరీస్ కోసం మరో ఒకరు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కోసం నేడు జరగబోయే టి20 మ్యాచ్ లో తలబడబోతున్నారు. ఈ క్రమంలోనే రెండవ టి20 ఎంతో హోరాహోరీగా జరగబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది  ఇకపోతే ఇటీవలే  గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ఇక టీమిండియా తుది జట్టులోకి రాబోతున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: