ధోని సెల్ఫీ.. ఇద్దరు విన్నింగ్ కెప్టెన్లు ఒకే ఫ్రేమ్ లో?

praveen
భారత క్రికెట్లో వరల్డ్ కప్ కెప్టెన్లుగా కొనసాగుతూ ఉన్నారు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని. ఇప్పుడు వరకు భారత జట్టు మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇక మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుకు గుర్తింపుని తెచ్చిపెట్టి అందరి చూపులు భారత జట్టుపై మళ్లేలా చేసింది కపిల్ దేవ్ అనే చెప్పాలి. 1983లో భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను మొదటిసారి అందించాడు కపిల్ దేవ్. ఇక ఈ వరల్డ్ కప్ సాధించి ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ కపిల్ దేవ్ కి మాత్రం మొదటి వరల్డ్ కప్ వీరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..

 ఇక ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు టీమిండియా కు మరోసారి వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారిపోయింది. ఎంతోమంది కెప్టెన్లు మారినా వరల్డ్ కప్ మాత్రం గెలవలేకపోయింది టీమ్ ఇండియా. ఇలాంటి సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత 2011 లో కూడా మరో వరల్డ్ కప్ సాధించి సత్తా చాటింది టీం ఇండియా. ఇప్పుడు వరకు భారత్ క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరు మాత్రమే టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ లుగా కొనసాగుతున్నారు.

 వీరికి సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ కూడా కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఇలాంటి వరల్డ్ కప్ వీరులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. భారత క్రికెట్ జట్టుకు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్లు ఇద్దరు కలిసి సెల్ఫీ దిగారు. కపిల్ దేవ్, ధోని గోల్ఫ్ మైదానంలో ఇలా సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోగా.. ఇది చూసిన అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి. వరల్డ్ కప్ కెప్టెన్లను ఒకే ప్రేమ్ లో చూసే భాగ్యం కలిగిందంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: