కోహ్లీ భార్యపై.. షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
గత కొంత కాలం నుంచి ఫామ్లో లేడు అని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియా కప్లో భాగంగా మళ్లీ మునుపటి ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్లో తన కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత మాట్లాడిన విరాట్ కోహ్లీ తాను కంబ్యాక్ అవ్వడానికి తన భార్య అనుష్క శర్మ కారణం అని ఆమె ఇచ్చిన సపోర్ట్ కారణంగానే నేను మునుపటి ఫామ్లోకి రాగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ సక్సెస్ లో మాత్రమే కాదు కష్టాల్లో వెన్నంటే ఉన్నందుకు ఇక కోహ్లీ భార్య అనుష్క శర్మ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి.

 నా కష్ట సమయాల్లో  అనుష్క ఎంతో అండగా నిలబడింది నేను ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని నెలలపాటు  నేను పేలవమైన ఫాంలో ఉన్నప్పుడు.. ఆమె నా వెన్నంటే ఉండి ఆమె నా కోసం అన్ని విషయాలను పట్టించుకుంది. నాకు సరైన రకమైన మార్గదర్శకత్వం చేసేది. ఆమె వల్లే నేను రిలాక్స్డ్ పర్సన్ గా మళ్లీ క్రికెట్లో తిరిగి వచ్చానని చెప్పాలి అంటూ విరాట్ కోహ్లీ అన్నాడు.  ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ విరాట్ కోహ్లీ విజయం వెనుక అతని భార్య అనుష్క శర్మ ఉంది అంటూ ప్రశ్నించాడు.

 మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తన భార్య గురించి మాట్లాడాడు. హ్యాట్సాఫ్ టు అనుష్క శర్మ. మీరు ఒక ఉక్కు మహిళ.. ఉక్కు కండరాల తో తయారైన వ్యక్తి మిస్టర్ విరాట్ కోహ్లీ అంటూ షోయబ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ మీకు అభినందనలు మీరు గొప్ప మనసున్న వ్యక్తి.. ఎప్పటికిగానే మీరు ఎదుగుతూ ఉండాలి.. ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ క్లియర్ గా మిగిలిపోతారు అంటూ విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: