మీరు మారిపోయారు సార్.. పుజారా మెరుపు ఇన్నింగ్స్?

praveen
ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా లో పోసాని కృష్ణమురళి చెప్పిన 'మీరు మారిపోయారు సార్' అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ఈ డైలాగ్ తెగ వాడుకలోకి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా విషయంలో కూడా 'మీరు మారిపోయారు సార్' అనే డైలాగ్ బాగా సూట్ అవుతుంది అని చెప్పాలి. ఇంతకీ ఎందుకు అంటారా.. ఒకప్పుడు ఎంతో ఆచితూచి ఆడుతూ పరుగులు చేసిన చటేశ్వర్ పుజారా ఇక ఇప్పుడు మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉన్నాడు. ఇక అతను సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోతుంటే.. మైదానంలో ఆడుతున్నది మనందరికీ తెలిసిన టెస్ట్ స్పెషలిస్ట్  బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారానేనా అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది అని చెప్పాలి.

 టీమిండియాలో పేలవమైన ఫామ్ కారణంగా చోటు దక్కించుకోలేకపోయాడు చటేశ్వర్ పూజారా. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటి ల్లో ఆడుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే టోర్నమెంట్ లో భాగంగా బౌలర్ల పై వీరవిహారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సెంచరీలతో చెలరేగిన పోతూ ఉన్నాడు.  సిక్సర్లు ఫోర్ లతో  విజృంభిస్తున్నాడు. ప్రస్తుతం ఈ టోర్నమెంట్లో భాగంగా ససెక్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే మరోసారి సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. 90 బంతులను ఎదుర్కొన్న చటేశ్వర్ పుజారా 24 ఫోర్లు రెండు సిక్సర్లతో 132 పరుగులు చేశాడు.

 టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా తనకున్న పాపులారిటీకి విరుద్ధంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 75 బంతుల్లోనే సెంచరీ అందుకోవడం గమనార్హం. అయితే ఈ టోర్నీలో ఇప్పటికే చటేశ్వర్ పుజారా మూడు సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇక చటేశ్వర్ పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్ నేపథ్యంలో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఇక అతని అద్భుతమైన ఫామ్ చూస్తుంటే.. ఆనందంలో మునిగి పోతున్న అభిమానులు మళ్ళీ త్వరలో అతను టీమిండియా లోకి రావడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: