అయ్యో.. బాబర్ అజాం పప్పులో కాలేశాడుగా?

praveen
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. ఈ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఇక ఈ మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొత్తంగా 74 సగటుతో 222 పరుగులు చేసాడు బాబార్. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ జట్టు పసికూన నెదర్లాండ్స్ పై వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే.

 చివరి వన్డే మ్యాచ్లో భాగంగా నెదర్లాండ్స్  జట్టు అటు పాకిస్తాన్ కి ఊహించని రీతిలో గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో  సమయంలో నెదర్లాండ్స్ గెలుస్తుంది అన్న విధంగానే కనిపించింది. కాని ఆ తర్వాత చివరిలో  సరైన బ్యాట్స్మెన్లు అందుబాటులో లేకపోవడంతో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది నెదర్లాండ్స్. అయితే మ్యాచ్ విజయం తర్వాత మాట్లాడిన కెప్టెన్ బాబర్ అజాం తమ జట్టును ఆల్ అవుట్ చేసిన ప్రత్యర్థి బౌలర్లను అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే అతను పప్పులో కాలేసాడు. చివరికి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాడు అని చెప్పాలి.

 ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ లో ఆడుతూ ఉండగా ఈ విషయాన్ని మరిచి పోయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ మా జట్టును ఆలౌట్ చేసిన స్కాట్లాండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇక బాబర్ ఇలా అనడంతో ఆడుతున్నది ఏ దేశంతోనో కూడా తెలియనంత మత్తు లో ఉన్నావా అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా స్కాట్లాండ్ నెదర్లాండ్స్ ఒమాన్ జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలపై క్రికెట్ ఆడుతూ రికార్డులు క్రియేట్ చేసే బాబర్  నెదర్లాండ్స్ కి బదులు స్కాట్లాండ్ అనడంలో తప్పు లేదని మరికొంతమంది సెటైరికల్ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: