ఏంటి పీవీ సింధు హీరోయిన్ అవ్వబోతుందా?

praveen
ఇటీవలి కాలంలో ఎవరూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు హీరోహీరోయిన్లుగా మారుతున్నారు అన్నది ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న సినిమాలతో ఎలాంటి సంబంధంలేని వ్యాపారవేత్త శరవణన్ ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ది లెజెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా అందరిని ఆశ్చర్యపరిచింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎంతో మంది క్రీడాకారులు కూడా అటు సినిమాల్లో భాగం అవుతూ కీలక పాత్రల్లో కనిపిస్తూ ఉండటం గమనార్హం. వెరసి రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీ లోకి ఎవరు వస్తారు అన్నది ఊహకందని విధంగానే ఉంది.

 అయితే ఇన్నాళ్ళ వరకు క్రీడా ప్రేక్షకులందరికీ కేవలం స్టార్ షట్లర్ గా మాత్రమే తెలిసిన పీవీ సింధు కూడా హీరోయిన్గా మారబోతుందా అంటే ప్రస్తుతం ఆమె చెప్పిన సమాధానం మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది అని చెప్పాలి. ఎప్పుడూ వరుస మ్యాచ్లతో బిజీబిజీగా ఉండే పివి సింధు ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమో చూసుకుంటే.. ఇక పీవీ సింధు మొదటి నుంచి చివరి వరకు ఎంతో స్పాంటేనియస్ పంచులతో నవ్వుతూ మాట్లాడింది.

ఈ క్రమంలోనే వ్యాఖ్యాత అలీ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.  ప్రస్తుతం స్టార్ షట్లర్ గా కొనసాగుతున్న పి.వి.సింధు ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటూ ప్రశ్నించాడు.. హీరోయిన్ అయ్యే అవకాశం లేదు అని పీవీ సింధు సమాధానం చెబుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం ఏమో చెప్పలేం.. హీరోయిన్ అవుతుండొచ్చు అంటూ సమాధానం చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. లేదంటే నా బయోపిక్ కూడా తీయవచ్చు అంటూ చెప్పుకొచ్చింది పీవీ సింధు. ఒకవేళ నీ బయోపిక్ తెరకెక్కిస్తే అందులో మీ ఒరిజినల్ తండ్రి సినిమాలో నాన్న పాత్ర పోషిస్తారా అంటూ అడుగగా.. అన్ని సీక్రెట్స్ బయటకి చెప్పేస్తారా అంటూ చెప్పింది పి.వి.సింధు. ఒకవేళ మీ బయోపిక్ తెరకేక్కిస్తే అందులో నేనే హీరో గా ఉంటాను అంటూ ఆలీ పంచ్ వేయడంతో పెద్దగా నవ్వేసింది పి.వి.సింధు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: