న్యూజిలాండ్ సంచలనం.. టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు?

praveen
ఇటీవలే స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు పసికూన స్కాట్లాండ్ పై పూర్తి ఆధిపత్యం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టి20  మ్యాచ్ల సిరీస్లో భాగంగా వరుసగా రెండో టీ20లలో విజయం సాధించి సత్తా చాటింది న్యూజిలాండ్ జట్టు. ఈ క్రమంలోనే 2- 0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎడిన్బర్గ్  వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఏకంగా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కివీస్ జట్టు. అదే సమయంలో ఒక అరుదైన రికార్డును కూడా సాధించింది అని చెప్పాలి.
 రెండవ టీ 20 మ్యాచ్లో భాగంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది న్యూజిలాండ్ జట్టు. ఈ క్రమంలోనే భారీ స్కోరు సాధించింది. అయితే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు ఎవరు సెంచరీ మార్క్ను అందుకోలేక పోయినప్పటికీ ఇలా భారీ స్కోరు చేయడం ఇది మొదటి సారి అని చెప్పాలి.  క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోవడంతో  ఇక 254 పరుగులు చేయగలిగింది. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగలిగింది. దీంతో 108 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది.

 ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఏకంగా న్యూజిలాండ్ టి20 క్రికెట్ చరిత్రలో ఇటీవలే స్కాట్లాండ్ పై సాధించిన 254 పరుగుల ఇప్పటివరకు అత్యధికం కావడం గమనార్హం. కాగా టి20  ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్ లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉంది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక టీ20 లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఇక ఇప్పుడు న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: