పుజారా అదరగొట్టాడు.. 8 మ్యాచుల్లో.. 1095 పరుగులు?

praveen
టీమిండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా ఇక ఇటీవల వరుస వైఫల్యాలతో కారణంగా అటు జట్టులో చోటు సంపాదించుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చేందుకు కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడుతూ ఉన్నాడు. ససెక్స్ జట్టు తరఫున ఆడుతున్న చటేశ్వర్ పుజారా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు అని చెప్పాలి. సెంచరీలు డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు కొడుతున్నాడు చటేశ్వర్ పుజారా. ఇటీవలే మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. ఏకంగా ససెక్స్ జట్టు తరఫున ఒకే సీజన్లో 1000 పరుగుల మార్కును అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి.

 ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన చటేశ్వర్ పుజారా ఒక వెయ్యి 95 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా అందులో మూడు డబుల్ సెంచరీ లు కూడా ఉండడం గమనార్హం. ఇక ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గ్లామర్గాన్ బ్యాట్స్మెన్  సామ్ నార్త్ ఈస్ట్ అగ్ర స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచుల్లో 1127 పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఇక ఇటీవల లిస్టర్ షేర్ తో జరిగిన మ్యాచ్ లో నార్త్ ఈస్ట్ 401 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఇక ఈ లిస్టులో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. అయితే కౌంటీ చాంపియన్షిప్లో   పుజారా  అద్భుతమైన ఫామ్ ప్రస్తుతం అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే పేలవమైన ఫామ్ నేపథ్యంలో చటేశ్వర్ పుజారా ను జట్టు నుంచి పక్కన పెట్టారు మ్ కానీ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించా.రు అంతకుముందు కౌంటీ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లలో సెంచరీలతో చెలరేగిన చటేశ్వర్ పుజారా అటు భారత్ తరపున మాత్రం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై విమర్శలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: