స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. షాక్ లో ఫాన్స్?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు వరసగా తమా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించటం చేస్తూ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తోన్నారూ. అంతేకాదు ఇక స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించగా ఇక ఇందుకు సంబంధించిన చర్చ ఇంకా సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇంతలోనే మరో స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

 స్కాట్లాండ్   జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతున్న కైల్ కోయేట్జర్ ఇటీవలే తన అంతర్జాతీయ టి20 క్రికెట్ లకు గుడ్ బై చెప్పేసాడు. మొన్నటివరకు స్కాట్లాండ్ జట్టు కెప్టెన్గా ముందుకు నడిపించిన ఈ సీనియర్ ప్లేయర్ మూడు వారాల క్రితమే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కుటుంబానికి  మరింత సమయం కేటాయించడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కోచింగ్ కెరీర్పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు టి 20ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే టీ 20 లకు రిటైర్మెంట్  ప్రకటించిన కైల్ కోయేట్జర్ వన్డేలకు మాత్రం అందుబాటులో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

 2008లో అంతర్జాతీయ టీ20 లో ఆరంగేట్రం చేసిన ఈ సీనియర్ ప్లేయర్ 70 మ్యాచ్లు ఆడి 1495 పరుగులు సాధించాడు. స్కాట్ ల్యాండ్  జట్టు తరఫున స్టార్ బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక 76 వన్ డే మ్యాచ్ లలో 2915 పరుగులు సాధించాడు. అయితే ఇక ఈ సీనియర్ ప్లేయర్ టి-20లకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రిచి బేరింగ్ టన్  నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది జట్టు యాజమాన్యం. ఇక న్యూజిలాండ్తో ఆడబోయే ఒకే ఒక వన్డే మ్యాచ్ కు కైల్ కోయేట్జర్ ఎంపికయ్యాడు.
 కాగా న్యూజిలాండ్ తో ఆడబోయే స్కాట్లాండ్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి :  రిచీ బెరింగ్టన్ (కెప్టెన్‌), మాథ్యూ క్రాస్ (వికెట్‌ కీపర్‌), కైల్ కోయెట్జర్ (వన్డేకు మాత్రమే), అలీ ఎవాన్స్, క్రిస్ గ్రీవ్స్, ఆలివర్ హెయిర్స్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, కాలమ్ మెక్‌లియోడ్, గావిన్ మెయిన్, క్రిస్ మక్‌బ్రైడ్, యాడ్, నీల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, హంజా తాహిర్, క్రెయిగ్ వాలెస్, మార్క్ వాట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: