పంత్ కాస్త బరువు తగ్గితే బాగుంటుంది : షోయబ్ అక్తర్
72 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్ ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు షోయబ్ అక్తర్ . అతనో ఒక అద్భుతమైన ఆటగాడు.. అతడు కట్ షాట్, ఫుల్ షాట్, రివర్స్ స్వీప్ షాట్ ఇలా అన్ని షాట్లు ఆడగలడని చెప్పుకొచ్చాడు. అయితే ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా బంతిని బౌండరీకి తరలించగలడు అంటూ మెచ్చుకున్నాడు.
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో రిషబ్ పంత్ టీమిండియాను గెలిపించాడూ. ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌లో కూడా భారత జట్టుకు సిరీస్ అందించాడు. ఇక పరిస్థితులకు తగ్గట్లుగా తన బ్యాటింగ్ మార్చుకుంటూ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతాడు. రాబోయే కాలంలో అతడు స్టార్ క్రికెటర్ కాబోతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు అని.. కొంచెం బరువు తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడు. ఇక రిషబ్ పంత్ కాస్త బరువు తగ్గించుకుంటే మోడల్ అవుతాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షోయబ్ అక్తర్.