ఫైనల్ మ్యాచ్.. ఆఖరి బాల్.. ఇంత హైడ్రామా చూసి ఉండరు ?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు  ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంటుంది. అలాంటిది ఇక ఫైనల్ మ్యాచ్ జరుగుతోందంటే ఇక క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ అంతా ఇంతా కాదు. కేవలం ప్రేక్షకులలో మాత్రమే ఆటగాళ్లలో కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో గెలిచాము అని ఆనందపడే లోపే షాకింగ్ వార్త తెలిస్తే.. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మ్యాచ్ లో  ఇలానే జరిగింది. బర్మింగ్హామ్ వేదికగా టీ20 బ్లాస్ట్ 2022 ఫైనల్ మ్యాచ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో చర్చకు వచ్చింది అని చెప్పాలి.

 లీగ్ దశలో అద్భుతంగా రాణించిన లంకా షైర్, హంప్ షైర్ జట్లు టీ20 బ్లాస్ట్ 2022 టోర్నీలో భాగంగా ఫైనల్లో అడుగు పెట్టాయి. ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో హంప్ షైర్ జట్టు ఆఖరి బంతికి విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి. కానీ ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన సమయంలో లంక షైర్ ఆటగాడు రిచర్డ్ గ్లెషన్ ను హంప్ షైర్ బౌలర్ నాథం ఎల్లిస్ అద్భుతంగా యార్కర్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆ జట్టుకు విజయం ఖరారయింది. దీంతో ఆటగాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి పోయారు అని చెప్పాలి. అంతలో గుండె పగిలే వార్త చెప్పాడు ఫీల్డ్ అంపైర్.

 సినిమాల్లో విలన్ లాగానే ప్రవర్తించాడు. బౌలర్ వేసిన ఆఖరి బంతిని అతను నో బాల్ గా ప్రకటించాడు. దీంతో అప్పటివరకు సంబరాల్లో మునిగి పోయిన ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోగా.. మైదానంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నో బాల్ తో పాటు ఫ్రీ హిట్ కూడా ఇచ్చాడు. దీంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. లంక షేర్ జట్టు చివరి బంతికి మూడు పరుగులు చేస్తే కోల్పోయిన  విజయం తిరిగి వస్తుంది. ఇలాంటి సమయంలో బంతిని అందుకున్న ఎల్లిస్ స్లో బాల్ వేయడంతో బైస్ రూపంలో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో హాంప్ షైర్ ఆటగాళ్లు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: