వావ్.. వరల్డ్ కప్ లో క్వాలిఫై అయిన జింబాబ్వే, నెదర్లాండ్స్?

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే . ఈ ఏడాది ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం  ఇవ్వబోతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్లో ప్రారంభం కాబోయే ఈ వరల్డ్ కప్ మీద ప్రస్తుతం అన్ని దేశాల జట్లు ప్రత్యేకమైన దృష్టి పెట్టాయి.  ఈ క్రమంలోనే  అత్యుత్తమ జట్టును బరిలోకి దింపేందుకు ప్రస్తుతం అన్ని దేశాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం అన్ని జట్లు వరల్డ్ కప్ లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి అనే దానిపై బిజీ బిజీగా ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం వరల్డ్ కప్ లో అర్హత సాధించడం కోసం పోటా పోటీగా పోరాడుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇలా వరల్డ్ కప్ లో క్వాలిఫై అయ్యేందుకు వరుసగా మ్యాచ్లు ఆడుతున్న జట్లు   జింబాబ్వే, నెదర్లాండ్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఈ రెండు జట్లు వరల్డ్ కప్ లో సాధిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న ఈ రెండు జట్లు ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి అనేది తెలుస్తుంది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ పోటీల్లో భాగంగా ఇటీవలే రెండు జట్లు సెమీస్లో అమెరికా, పపువా న్యూ గినియా జట్లను ఓడించాయి. దీంతో ఇక ప్రపంచకప్లో చోటు దక్కించుకున్నాయ్ అనే చెప్పాలి.

 అయితే సెమీస్ మ్యాచ్లో భాగంగా తొలుత పపువా న్యూగినియాతో తలపడింది జింబాబ్వే జట్టు. 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.అయితే తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పపూవా న్యూ గినియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగలిగింది. దీంతో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో అమెరికా 19.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక నెదర్లాండ్స్  జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది. దీంతో రెండు జట్లూ వరల్డ్ కప్ కోసం అర్హత సాధించాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: