విరాట్ కోహ్లీ మరోసారి విఫలం... ఇక ఇంటికే పరిమితం ?

VAMSI
ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక టెస్ట్ మరియు టీ 20 కంప్లీట్ అయ్యాయి. కాగా ఇరు జట్లు కూడా మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, టీ 20 లో మాత్రం ఇండియా విజయకేతనాన్ని ఎగురవేసింది. ఎటువంటి  అంచనాలు లేకుండా మొదలు పెట్టిన మొదటి మ్యాచ్ లో హార్దిక్ ఆల్ రౌండ్ విజృంభణతో ఇంగ్లాండ్ ను ఓడించింది. అలా ఇండియా విజయం తో ఈ రోజు కాసేపటి క్రితం రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్ ద్వారా సీనియర్ లు పంత్, కోహ్లీ మరియు బుమ్రా లు ఎంట్రీ  ఇచ్చారు. ఇక ఆరంభంలో రోహిత్ పంత్ లు ఎడాపెడా బౌండరీలు బాదారు.
ఓపెనర్లు అందించిన భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోలేక వరుసగా ఇండియా వికెట్లను కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్ లో ఎన్నో అంచనాలు మరియు ఒత్తిడితో ఆడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రోహిత్ అవుట్ ఐన తర్వాత క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడు బంతులను ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అరంగేట్రం బౌలర్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో మలన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు వరకు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం కనీసం అర్ద సెంచరీ అయినా చేస్తాడని అభిమానులు మరియు జట్టు యజమాన్యమ్ ఎంతో నమ్మకం పెట్టుకుంది.
కానీ కోహ్లీ మాత్రం తన తీరును మార్చుకోకుండానే ఎప్పటిలాగే అవుట్ అయ్యాయి కోట్లాదిమంది ఆశలను నీరుగార్చాడు. దీనితో ఇక అందరూ ఫిక్స్ అయిపోయారు... కోహ్లీ ఇక ఫామ్ లోకి రావడం కుదరదు. సీనియర్ ఆటగాళ్లు చెబుతున్న విధంగా కోహ్లీని ఇంటికి సాగనంపాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: