పాపం స్టీవ్ స్మిత్.. ఇల్లు అమ్ముకుంటున్నాడట?

praveen
ఆస్ట్రేలియా క్రికెట్ లో స్టార్ ప్లేయర్గా స్టివ్ స్మిత్ కి ప్రత్యేకమైన గుర్తింపు. ఒకప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా కూడా ముందుండి  నడిపించాడు.. గత కొంతకాలం నుంచి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన స్మిత్ ఇప్పుడు ఫామ్  కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఏ ఫ్రాంచైజీ ఈ స్టార్ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

 ఆస్ట్రేలియా జట్టు తరఫున అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. అతనిపై ఉన్న అంచనాలు కూడా రోజురోజుకూ తగ్గిపోతున్నాయి  అని చెప్పాలి.  ఇక ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఇటీవలే స్టీవ్ స్మిత్ సిడ్నీ లో ఉన్న తన విలాసవంతమైన ఒక విల్లాను అమ్మకానికి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. 12.38 మిలియన్ డాలర్లకు తన విల్లాను అమ్మడానికి సిద్ధమయ్యాడు అంటూ ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.  ఇక ఈ విల్లాలో మినీ సినిమా థియేటర్, హీటెడ్  స్విమ్మింగ్ పూల్  సహా అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి.

 దీంతో స్టీవ్ స్మిత్ ఇక ఇప్పుడు ఈ ఖరీదైనవి లని ఎందుకు అమ్మవలసి వచ్చింది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల దాని విక్రయించాల్సి వచ్చిందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు తాను కొన్న ధర కంటే రెట్టింపు ధర రావడంతోనే ఇక ఈ విలాసవంతమైన బంగ్లా అమ్మేందుకు స్మిత్ సిద్ధమయ్యాడు అంటూ ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఇంటిని 6.6 మిలియన్ డాలర్లకు 2020లో కొనుగోలు చేశాడు. భార్య డెని విల్లీస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక ఇప్పుడు 12.38 మిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: