టీమిండియాకు దెబ్బమీద దెబ్బ.. ఇప్పటికే ఓటమి బాధ.. ఇక ఇప్పుడు?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జులై 1వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ మ్యాచ్ లో అటు జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మొదటి మూడు రోజుల ఆట లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసింది టీమిండియా. పూర్తి ఆధిపత్యాన్ని కూడా చెలాయించింది. కానీ నాలుగో రోజు ఆటలో పట్టు కోల్పోయింది. చివరికి ఇక విజయం సాధిస్తుంది అనుకున్న టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక ఈ ఓటమితో అటు టీమిండియా సిరీస్ గెలవడం కాదు 2-2 సమం చేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో అటు టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.

 ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధిస్తామని అనుకుంటే  ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఇక తాము చేసిన తప్పులను గుర్తిస్తూ వాటిని మరోసారి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడేందుకు సిద్ధమవుతున్నారు టీమిండియా ఆటగాళ్లు. అయితే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న టీమ్ ఇండియాకు ఇప్పుడు పుండు మీద కారం చల్లి నట్లు పరిణామం ఎదురయింది అన్నది  తెలుస్తోంది.  ఇంగ్లాండ్తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్ పై ఐసీసీ  చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. స్లో  ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 40% జరిమానా తో  పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసిసి.

 ఐసీసీ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నాలుగవ స్థానానికి పడిపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఇదే సిరీస్లో తొలి టెస్టులో ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో సెంచరియన్ వేదికగా జరిగిన టెస్టులో కూడా ఇదే రీతిలో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో ఇక టీమిండియాపై అప్పుడు కూడా ఐసీసీ ఇలాంటి చర్యలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటి వరకూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదు పాయింట్లు కోల్పోయింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: