పరుగుల్లోనే కాదు.. ప్రైజ్ మనీలోనూ బట్లర్ టాప్?

praveen
ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన జోష్ బట్లర్ ఎంత అద్భుతంగా రాణించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఏకంగా సెంచరీలతో అదరగొట్టాడు జోస్ బట్లర్. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా ఫైనల్లో నిలబడింది అంటే కేవలం జోస్ బట్లర్ వీరోచితమైన పోరాటం వల్లనే అని చెప్పాలి.   ఈ క్రమంలోనే ఈసారి ఐపీఎల్ సీజన్ లో 863 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు జోస్ బట్లర్.

 ఈ క్రమంలోనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే జోస్ బట్లర్ ఎంత అద్భుతమైన పోరాటం చేసినప్పటికీ అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో గుజరాత్ చేతిలో ఓడిపోయి రన్నరప్ తోనే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన జోస్ బట్లర్ అవార్డు అందుకోవడంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించాడు అనేది తెలుస్తుంది. మొత్తంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 37 అవార్డులు అందుకున్నాడు బట్లర్. ఈ అవార్డుల ద్వారా 95 లక్షల ప్రైస్ మనీ  ఖాతాలో వేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. ఐపీఎల్‌ 15వ సీజన్‌‌ అవార్డుల్లో ఆరెంజ్‌‌ క్యాప్‌‌, మోస్ట్ వాల్యుబుల్‌‌, గేమ్‌‌ చేంజర్‌‌, మ్యాగ్జిమమ్‌‌ ఫోర్స్‌‌, మ్యాగ్జిమమ్‌‌ సిక్సెస్‌‌, పవర్‌‌ ప్లేయర్‌‌ పురస్కారాలతో రూ. 60 లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ స్టేజ్‌‌లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ. 7లక్షలు వెనకేసుకున్నాడు. వివిధ  మ్యాచ్‌‌ల్లో పవర్ ప్లేయర్,  గేమ్ చేంజర్,  మోస్ట్ ఫోర్స్,  మోస్ట్‌‌ సిక్సెస్‌‌, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌‌, సూపర్ స్ట్రైకర్‌‌ అవార్డులతో మరో 28 లక్షలు  దక్కించుకున్నాడు. ఇక వేలంలో రాజస్థాన్‌ బట్లర్‌ను రూ. 10 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: