గుజరాత్ టైటాన్స్ విజయం.. తెరవెనుక అజ్ఞాత వ్యక్తి?

praveen
సాధారణంగా క్రికెట్ లో ఏదైనా జట్టు మంచి ప్రదర్శన చేసి విజయం సాధించిందంటే చాలు ఆ జట్టు కెప్టెన్గా ఉన్న వ్యక్తి పైనే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ప్రతి ఒక్కరు. ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇలా జట్టు గెలిచిన  తర్వాత ఆ జట్టు ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేశారు అన్న దాని కంటే ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ముందుకు నడిపించింది ఎవరు అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ విజయంలో కూడా ఇదే జరుగుతుంది అని తెలుస్తోంది. నిజంగానే జట్టుకు కర్త కర్మ క్రియ అన్నీ తానై ముందుకు నడిపిస్తూ ఉంటాడు కెప్టెన్.

 క్రికెట్ జట్టు మంచి విజయాన్ని సాధించినా ఆ విజయానికి హీరోగా మారిపోయేది కెప్టెన్ మాత్రమే అనే విషయం తెలిసిందే. కానీ జట్టు విజయం వెనక తెరవెనుక హీరో మరొకరు ఉంటారు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టడం వెనుక కూడా తెర వెనుక మరో హీరో ఉన్నారు అనేది తెలుస్తుంది. అతనే కోచ్.. ఎందుకంటే అందరి ఆటగాళ్లను సమన్వయం చేస్తూ బలహీనంగా ఉన్నా ఆటగాళ్లను  గమనిస్తూ ఎప్పటి కప్పుడు జట్టును పటిష్టంగా  ఉంచేందుకు కోచ్ నిరంతరం తాపత్రయ పడుతూనే ఉంటాడు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు వెనకాల కూడా ఒక అజ్ఞాత వ్యక్తి మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ ఉన్నారు.

 ఎప్పుడైతే దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్స్టన్ గుజరాత్ టైటాన్స్ మెంటార్ గా వచ్చాడో అప్పుడే సగం విజయం సాధించినట్లే అని అనుకున్నారు ఎంతోమంది. ఎందుకంటే అతను ఎంత గొప్ప కోచ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడం లో ఎంతో కీలక పాత్ర పోషించాడు. జట్టును ముందుండి నడిపించి ఇక వెనకుండి సూచనలు సలహాలతో అందర్నీ మెరుగ్గా రాణింఛేలా చేశాడు. ఈయన మెంటార్ గా ఉండడం వల్ల అటు గుజరాత్కు ఎంతగానో కలిసొచ్చిందని గుజరాత్ విజయానికి కూడా దోహదపడిందని ఎంతో మంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: