బట్లర్ నా రెండో భర్త.. షాకిచ్చిన క్రికెటర్ భార్య?

praveen
ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటి వరకు ఏకంగా 16 మ్యాచ్లు ఆడిన జోస్ బట్లర్ ఏకంగా ఎనిమిది వందల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లలో కూడా సెంచరీ చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని అందించి ఇక జట్టును ఫైనల్కు చేర్చాడు. మధ్యలో కొన్ని మ్యాచులలో కాస్త తడబడినట్లు కనిపించినా మళ్ళీ పుంజుకున్నాడు అని చెప్పాలి.

 అయితే ఇటీవలే తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భాగంగా 89 పరుగులు సాధించి అదరగొట్టాడు జోస్ బట్లర్. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ ఆటగాడు రాస్సి వాన్ డేర్ డస్సేన్ భార్య లారా బట్లర్ బౌండరీ బాదిన ప్రతిసారి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది.  దీనికి సంబంధించిన  వీడియో వైరల్ గా మారిపోయింది. కాగా ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ పాడ్ కాస్ట్ లో చాహల్ భార్య ధనశ్రీ వర్మ, పృతి అశ్విన్ ల తో కలిసి మాట్లాడిన లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లారా బట్లర్ బ్యాటింగ్ ని బాగా ఎంజాయ్ చేయడంతో ఆమె బట్టర్ భార్య అనుకున్నారు ఎంతో మంది ప్రేక్షకులు.

 ఇక ఇటీవలే జరిగిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఇప్పుడు జోస్ బట్లర్ ను నా రెండవ భర్తగా స్వీకరించానని అనుకుంటున్నాను. నన్ను లూయిస్ అని పిలుస్తారు. ఎందుకంటే అతని భార్య పేరు అదే కదా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది లారా. అందరూ నన్ను జోస్ బట్లర్ భార్య అనుకొని కెమెరాలు కూడా చాలాసార్లు ఫోకస్ చేశాయి. నేను బట్లర్ ను  ఎంతో ప్రోత్సహిస్తున్న కాబట్టి అందరూ అలాగే అనుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన భర్త డస్సేన్ అంతగా ఆడలేదు కాబట్టి అతడిని ఉత్సాహపరిచలేక పోయాను అంటూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: