అతని బౌలింగ్ కి భయపడేవాడిని : వీరేంద్ర సెహ్వాగ్

praveen
పాకిస్తాన్ క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్  కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ నుంచి అటు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు షోయబ్ అక్తర్. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఎప్పుడు బ్యాట్స్మెన్లను  భయ పెడుతూ ఉండేవాడు అని చెప్పాలి  ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ కూడా షోయబ్ అక్తర్ పేరిటే ఉంది. ఈ రికార్డును ఇప్పటికీ కూడా ఎవరూ బ్రేక్ చేయలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ బౌలింగ్ ప్రతిభ గురించి  భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 షోయబ్ అక్తర్ బౌలింగ్ ను చక్కర్ అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. పాక్ ఆటగాడు షోయబ్ అక్తర్ తన ఎల్బొ కదిలిస్తూ బౌలింగ్ చేసే వాడని గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ తరహా బౌలింగ్ను క్రికెట్ భాషలో చక్కెర్ అని సంబోధిస్తూ ఉంటారు. అందుకే షోయబ్ అక్తర్ బౌలింగ్ ను ఐసిసి కొంతకాలంపాటు బ్యాన్ చేసింది కూడా. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాక్షన్ యాంగిల్ కాస్త డౌన్ లో వస్తుంది అందువల్ల అతని బౌలింగ్ కి పెద్దగా కష్టం అనిపించదు.

 కానీ షోయబ్ అక్తర్ బౌలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు అర్థం అయ్యేది కాదు. అయితే ఆ రోజుల్లో షోయబ్ అక్తర్ బౌలింగ్ ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపించింది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు షేన్ బాండ్ కూడా ఒకరు అన్న విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర చెప్పుకొచ్చారు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్ స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్మెన్ లను ఇబ్బంది పెడుతూ ఉండేది. అయితే షోయబ్ అక్తర్  సంధించే యార్కర్ ఎక్కడ నా కాళ్ళకు తగులుతుందో అని భయపడేవాడిని అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: