కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. ?
కోల్కతా నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో టీమ్ అంతా సమిష్టిగా విఫలం అయింది. దీనితో సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోవడంతో పాటుగా రన్ రేట్ కూడా దారుణంగా కోల్పోయింది. ప్రస్తుతం సన్ రైజర్స్ 12 మ్యాచ్ లలో 5 గెలిచి 10 పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది. ఇక నెట్ రన్ రేట్ చూసుకుంటే -౦.270 కు చేరుకుంది. అలా కోలకతా సన్ రైజర్స్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్కతా ఆడిన 13 మ్యాచ్ లలో 6 గెలిచి 12 పాయింట్ లతో ఏకంగా ఆరవ స్థానానికి చేరుకుంది. అంతే కాకుండా తమ రన్ రేట్ +0.160 ను కూడా మెరుగు పరుచుకుంది.
ఇప్పుడు కోలకతా పంజాబ్ కన్నా మెరుగ్గా ఉంది. కానీ పంజాబ్ ఖాతాలో 10 పాయింట్లు మరియు రెండు ఆడాల్సిన మ్యాచ్ లు ఉన్నాయి. ఇక ప్లే ఆఫ్ రేస్ మరీ ఇంటరెస్టింగ్ గా మారింది. కోల్కతా తన ఆఖరి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో...?