నెం.1 మెస్సి.. కోహ్లీ ఎన్నో స్థానం తెలుసా?

praveen
ప్రపంచ  వ్యాప్తంగా ఫుట్బాల్ ఆట కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతుంటారు ప్రేక్షకులు. స్టేడియం లోకి వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి మరింత ఆసక్తి చూపుతుంటారు అని చెప్పాలి. ఈ రేంజ్ లో క్రేజ్ వుంది కాబట్టే ఫుట్బాల్ లో స్టార్ ప్లేయర్ లుగా కొనసాగుతున్న వారికి ఊహించని పారితోషికం ఉంటుంది అని చెప్పాలి. ఫుట్బాల్ స్టార్ ప్లేయర్స్ అందుకునే పారితోషికం కొన్నిసార్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ వార్తల్లో చర్చనీయాంశం గా మారి పోతూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్  మెస్సి ఒక అరుదైన ఘనత సాధించాడు.  2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్గా లియోనేల్ మెస్సిజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇటీవలే ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో మెస్సి తొలి స్థానం లో ఉండటం గమనార్హం. దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండవ స్థానం లో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో మూడవ స్థానం లో నిలిచారు.

మే 1వ తేదీ వరకు లియోనేల్ మెస్సిజ్ 131 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని అందుకోవడం గమనార్హం. ఇక ఇందులో 55 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపం లో సంపాదించాడు మెస్సి  ఇక రెండో స్థానం లో ఉన్న  ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ 121 డాలర్లు పారితోషికం తీసుకున్నాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఫుట్బాల్ టీం కెప్టెన్ క్రిస్టియన్ రోనాల్డో 115 మిలియన్ డాలర్లు పారితోషకం తీసుకోవడం గమనార్హం. ఇక ఇదే జాబితా లో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 61 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక భారత క్రికెట్ నుంచి ఎవరూ కూడా టాప్ 100లో చోటు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: