అతను ఆడుతుంటే భయమేసింది : కేఎల్ రాహుల్

praveen
కోల్కతా నైట్రైడర్స్ జట్టులో పవర్ హిట్టర్ ఎవరు అంటే టక్కున చెప్పేస్తారు ఆండ్రూ రస్సెల్ అని. ఎన్నో రోజుల నుంచి కోల్కతా జట్టు లో కొనసాగుతూ వస్తున్న ఆండ్రూ రస్సెల్ అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి జట్టును విజయతీరాలకు వైపు నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఒంటిచేత్తో జట్టుకు విజయం అంధించగల సత్తా ఆండ్రూ రస్సెల్ సొంతం అని చెప్పాలి. క్రీజ్లో ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో పవర్ హిట్టింగ్ ఉంటుంది కాబట్టి.

 భారీగా సిక్సర్, ఫోర్లతో చెలరేగి పోతు ఉంటాడు ఆండ్రూ రస్సెల్. అందుకే ఈ పవర్ హిట్టర్ ను కోల్కతా నైట్రైడర్స్ జట్టు యాజమాన్యం ఎప్పుడూ తమతో పాటే అంటిపెట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే లక్నో, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా లక్నో బౌలింగ్ ధాటికి చేతులెత్తేసి వికెట్ చేజార్చుకుని పెవిలియన్ చేరుతూ ఉంటే.. ఆండ్రూ రస్సెల్ మాత్రం ఎంతో దూకుడుగా ఆడుతూ దాదాపు 45 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆండ్రూ రస్సెల్ ఆడుతున్న సమయంలో తనకు భయం వేసింది అంటూ చెప్పుకొచ్చాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.

 కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై75 పరుగుల తేడాతో గెలవడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో క్వింటన్ డికాక్,దీపక్ హుడా, స్టయినిస్, హోల్డర్ ధాటిగా ఆడి లక్నో జట్టుకు మంచి స్కోర్ అందించారు.  తర్వాత బౌలర్లు కూడా బాగా రాణించారు అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.  ఇంతకంటే వారి నుంచి ఎక్కువగా ఆశించలేను అంటూ తెలిపాడు. ఇక 45 పరుగులతో కోల్కతా ఆండ్రూ రస్సెల్ ఆడుతున్న సమయంలో భయమేసింది. కానీ మా బౌలర్లు సరైన ప్రణాళికలతో ఆండ్రూ రస్సెల్ ను కట్టడి చేశారు అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: