క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ నాదే : పాక్ మాజీ ప్లేయర్

praveen
ఇటీవలి కాలంలో ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు మెరుపువేగంతో బంతులను విసురుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నింటినీ కూడా చెరిపేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉన్నారు. బుల్లెట్ వేగంతో యువ ఆటగాళ్లు బంతులు విసురుతున్న నేపథ్యంలో ఇక క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతి విసిరిందెవరు అనే అంశం కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలోనే స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇక ఇదే విషయంపై ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ సమీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ చరిత్రలో వేగవంతమైన బంతి ఎవరు విసిరారు అన్న విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందరూ అనుకుంటున్నట్లుగా షోయబ్ అక్తర్ ది కాదు తాను రెండు సందర్భాల్లో అంతకు మించిన వేగంతో బంతులు విసిరాను అంటూ మొహమ్మద్ సమి చెప్పుకొచ్చాడు. అప్పట్లో మిషన్లు పని చేయక ఆ రికార్డు  తనకు దక్కలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  పాకిస్తాన్ లోని ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాజీ క్రికెటర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ మ్యాచ్లో తాను రెండు బంతులు 160 కిలోమీటర్ల వేగానికి పైగా వేశానని.. అందులో ఒకటి 162 కిలోమీటర్లు మరొకటి 164 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు స్పీడ్ గన్ మిషన్లు పని చేయకపోవడంతో తాను సాధించిన ఘనత ప్రపంచానికి తెలియకుండా కనుమరుగయ్యింది అని తెలిపాడు. ఇక ఇటీవల ఈ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. పాకిస్తాన్ తరఫున 36 టెస్టులు 87 వన్డేలు 13 టీ20 లు ఆడాడు మహమ్మద్ సమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: