'డ్రా' అయినా విన్నర్ మాత్రం 'ఇంగ్లాండ్'... అదెలా చెప్మా?

VAMSI
ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇక ఒక ఆఖరి టెస్ట్ మాత్రంమే మిగిలి ఉంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ కు వేళా విశేషం ఏమీ బాగా లేనట్టుంది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒక్కటి కూడా గెలవలేక సిరీస్ ను ఆసిస్ కు అప్పగించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ ల వైఫల్యమే దారుణ కూటములకు కారణం అయింది. అయితే నాలుగవ టెస్ట్ చివయిర్ రోజు ఆటలో మాత్రం ఇంగ్లాండ్ అభిమానుల మనసును గెలుచుకుంది. వాస్తవంగా అయితే నిన్నటి వరకు ఉన్న ఆటతీరును పరిశీలిస్తే ఆస్ట్రేలియా మరి విన్ కు దగ్గరయింది అని అందరికీ తెలుస్తుంది.
అయితే ఈ రోజు ఆట మొదలైనప్పటి నుండి చివరి అయిదు ఓవర్ల వరకు ఆస్ట్రేలియా ఫేవరెట్ గా ఉంది. అయితే ఓటమి పాలవుతుంది అనుకున్న ఇంగ్లాండ్ చివరికి మ్యాచ్ ను డ్రా చేసుకుంది. నిజంగా ఇంగ్లాండ్ కు ఈ సిరీస్ అంతటికీ ఒక ఆనందాన్నిచ్చే ఫలితం ఇదే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ ను డ్రా అవడంలో శాయశక్తులా కష్టపడిన బైర్ స్టో, స్టోక్స్, లీక్ , బ్రాడ్ మరియు ఆండర్సన్ లను దేశం అంతా ప్రశంసిస్తోంది.
ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు అని చెప్పాలి. ఎందుకంటే కచ్చితంగా గెలుస్తుంది అని ప్రతి ఒక్కరూ నమ్మరు. కానీ వెలుతురు లేమి వలన చివరి ఓవర్ స్పిన్నర్ తోనే బౌలింగ్ వేయించాలి అన్న అంపైర్ నిర్ణయమే ఆస్ట్రేలియా కొంపముంచింది. ఆఖరి ఓవర్లో స్టీవ్ స్మిత్ బౌలింగ్ లో ఆండర్సన్ బ్యాటింగ్ చేస్తుంటే వికెట్ పడడం పక్కా అని అంతా భావించారు. అయితే ఆండర్సన్ తనకున్న అనుభవంతో స్టీవ్ స్మిత్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని డ్రా అవడానికి సహాయపడ్డాడు. అందుకే ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది. దీనితో మ్యాచ్ డ్రా అయినా విన్నర్ ఇంగ్లాండ్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: