ఒక్క సెంచరీ.. అతన్ని మళ్ళీ స్టార్ట్ చేసింది?

praveen
బీసీసీఐ అటు దేశవాలి టోర్నీ అయినా విజయ్ హజారే ట్రోఫీ ని ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడానికి ఐసిసి నిర్వహించే విజయ్ హజారే ట్రోఫీ ఒక మంచి వేదికగా మారింది. యువ ఆటగాళ్లు మాత్రమే కాదు సీనియర్ ఆటగాళ్లు సైతం విజయ్ హజారే ట్రోఫీ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ఇటీవలే ప్రస్తుతం టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్  గా కొనసాగుతున్న దినేష్ కార్తీక్ కూడా విజయ్ హజారే ట్రోఫీ లో అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా  సెంచరీతో చెలరేగిన పోయాడు. దీంతో అందరి దృష్టి అతనిపై పడింది.

 అయితే ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో హిమాచల్ ప్రదేశ్  జట్టు తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది అనే విషయం తెలిసిందే. జైపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు ను ఓడించి విజయఢంకా మోగించింది. అయితే తమిళనాడు జట్టు ఓడిపోయినప్పటికీ ఆ జట్టులో కొనసాగిన దినేష్ కార్తీక్ మాత్రం తన బ్యాటింగ్తో అందరిని ఆకర్షించాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. తమిళనాడు జట్టు 315 పరుగుల భారీ స్కోరు చేయడంలో దినేష్ కార్తీక్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. వరుసగా బౌండరీలతో చెలరేగిపోయాడు దినేష్ కార్తీక్.

 ఇక అంతకు ముందు వరుసగా పశ్చిమబెంగాల్ పుదుచ్చేరి జట్లపైన 87, 65 పరుగుల తో కూడా రాణించాడు. అయితే ఐపీఎల్ మెగా వేలం ముందు దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణించడంతో ప్రస్తుతం అందరిచూపు దినేష్ కార్తీక్ పై పడిపోయింది. అయితే మెగా వేలంలో దినేష్ కార్తీక్ ను ఏ జట్టు కూడా రిటైన్ చేసుకోలేదు. దీంతో ఒకవైపు దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం అదే సమయంలో అతనికి కెప్టెన్గా చేసిన అనుభవం కూడా ఉండడంతో అతనిని తమ జట్టులోకి తీసుకోవాలని ఇక రానున్న వేలంలో ఎన్నో ఫ్రాంచైజీలు పోటీపడతాయని అంచనా వేస్తున్నారు. ఒక సెంచరీ దినేష్ కార్తీక్ ను మరోసారి తెర మీదికి తెచ్చింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: