ఇరగదీసిన ధావన్.. ఆ జట్టు మొదటిసారి ఫైనల్లోకి?

praveen
భారత క్రికెట్ లో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ప్రత్యేకమైన క్రేజ్ వుంది ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే భారీగా పరుగులు చేస్తూ టీమిండియాను విజయం వైపు నడుస్తూ ఉంటాడు శిఖర్ ధావన్. ఎప్పుడూ మైదానంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇక తన ఆటతీరుతో భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా గబ్బర్ గా మారిపోయాడు శిఖర్ ధావన్. ఎలాంటి రికార్డు సాధించిన కూడా మైదానంలో తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రేక్షకులందరినీ మరింత ఆకర్షించాడు అనే చెప్పాలి.. అయితే ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ లో దావన్ అదరగొట్టాడు.

 ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.. నిజంగానే దావన్ అదరగొట్టాడు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడ అదరగొట్టింది టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కాదు యువ ఆటగాడు రిషి ధావన్. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జరుగుతోంది. విజయ్ హజారే ట్రోఫీ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో చెలరేగి పోతున్నారు. వరుసగా సెంచరీలు బాదుతూ సెలెక్టర్ల చూపు ఆకర్షిస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇలా సెలెక్టర్లను ఆకర్షించగా.. ఇక ఇప్పుడు మరో కొత్త ఆటగాడు తెరమీదికి వచ్చాడు. ఇక ఈ ట్రోఫీలో హిమ చల్ ప్రదేశ్  జట్టు తరఫున ఆడుతున్నాడు రిషి ధావన్. అయితే హిమాచల్ ప్రదేశ్ జట్టు మొదటిసారి ఫైనల్ లోకి వెళ్ళింది అని చెప్పాలి.  సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్  77 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 అయితే హిమాచల్ ప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు యువ ఆటగాడు రిషీ ధావన్. ఇక ఆల్రౌండ్ ప్రదర్శన తో అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్  జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో 46.1 ఓవర్లలో ప్రత్యర్థి జట్టు 204 పరుగులు చేసి చివరికి ఆలవుట్ అయ్యింది. దీంతో అటు సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్  జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.. ఈ జట్టు మొట్టమొదటిసారి ఫైనల్కు చేరుకోవడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్లో 9 ఫోర్లు ఒక సిక్సర్తో 84 పరుగులు చేశాడు రిషి ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: