వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుండి.. న్యూజిలాండ్ ఔట్?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం వరుసగా మ్యాచ్లు నిర్వహిస్తుండటం గమనార్హం. అయితే క్రికెట్  ఆటగాళ్లు అందరిని కూడా కఠినమైన నిబంధనలు మధ్య క్వారంటైన్ లో ఉంచుతు.. క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రికెట్ ఆటగాళ్లందరూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం ఒక హోటల్ గదికి మాత్రమే పరిమితం అయి క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉండటం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే క్వారంటైన్ కారణంగా ఆటగాళ్లు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

 అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేసేదేమీలేక బయో బబుల్ లోనే ఆటగాళ్ల ను వుంచి క్రికెట్ మ్యాచ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది స్టార్ ఆటగాళ్లు సైతం బయో బబుల్ లో మానసికంగా అలిసిపోయి క్రికెట్ కి కొంచెం బ్రేక్ తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ విషయంలో ఆలోచనలో పడింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. కీలక నిర్ణయం తీసుకుంది. 2022 లో జరగబోయే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

 2022 లో వెస్ట్ ఇండీస్ లో అండర్ 19 ప్రపంచ కప్ జరగబోతుంది. ఈ ప్రపంచకప్ నుంచి తాము తప్పు కుంటున్నాము  అంటూ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఒకవేళ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటే ఆ తర్వాత స్వదేశంలో ఆటగాళ్లపై క్వారంటైన్ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కారణంగానే ప్రపంచ కప్ లో పాల్గొనడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ జట్టు తప్పుకోవడంతో ఇక ఆ స్థానంలో స్కాట్లాండ్ అవకాశం దక్కించుకుంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లు 4 గ్రూపులుగా విభజించగా భారత్ బి గ్రూపులో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: