భారత్-కివీస్ తొలి మ్యాచ్‌ అనుమానమే..!

Podili Ravindranath
ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. అన్ని జట్ల ఆటగాళ్లు వాళ్ల వాళ్ల దేశాలకు పయనమయ్యారు. న్యూజీలాండ్ జట్టు మాత్రం భారత్‌తో ద్వై పాక్షిక సిరీస్ కోసం రెడీ అవుతోంది. దుబాయ్ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఓడింది. బుధవారం నుంచి భారత్‌తో జరిగే సిరీస్ కోసం విలియమ్‌సన్ సేన రెడీ సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య 3 ట్వంటీ 20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌కు జైపూర్ వేదిక కానుంది. అయితే జైపూర్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం తొలి ట్వంటీ 20 మ్యాచ్‌కు ఆతిధ్యం ఇస్తోంది. ప్రస్తుతం ఉత్తర భారతం తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అయితే ఏకంగా వారం రోజుల పాటు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అన్ని విద్యా సంస్థలకు వారం రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించింది.
ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉత్తర భారతంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. గాలిలో నాణ్యతా సూచి ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ప్రస్తుతం జైపూర్ సిటీలో కాలుష్యం భారీస్థాయిలో పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే బాబోయ్ అనేలా ఉంది. అటు పొగ మంచు కూడా తొడవ్వడంతో... గాలి నాణ్యతా సూచి 350 వద్దకు చేరుకుంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత విషమంగా తయారైంది. జైపూర్‌లో పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కివీస్‌తో జరిగే తొలి టీ 20 మ్యాచ్‌ జరిగేది లేదని అనేది ఆ రోజు మాత్రం తెలిసే అవకాశం ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపూర్‌ స్టేడియం ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిధ్యం ఇస్తోంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క టీ 20 మ్యాచ్ కూడా జరగలేదు. కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా దాదాపు పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: