ముదురుతున్న షోయబ్ అక్తర్ వివాదం.. విచారణకు ఆదేశాలు జారీ

M Manohar
లైవ్ షోలో మాజీ ఫాస్ట్ బౌలర్.. క్రికెట్ నిపుణుడు షోయబ్ అక్తర్.. హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్‌ ఇద్దరు మాటల వాగ్వాదానికి పాల్పడిన సీషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఆ లైవ్ షో నిర్వహించిన పాకిస్తాన్ న్యూస్ ఛానెల్‌పై విరుచుకుపడ్డాడు. టీ 20 ప్రపంచ కప్‌ లో న్యూజిలాండ్‌ పై పాకిస్థాన్ విజయాన్ని విశ్లేషిస్తూ... ప్రభుత్వ యాజమాన్యంలోని పీటీవీ లైవ్ షో లో హోస్ట్.. సెట్ నుండి బయలుదేరమని చెప్పడంతో అక్తర్ ఆ టీవీ ప్రోగ్రామ్ నుండి బయటకు వెళ్లి. క్రికెట్ విశ్లేషకుడిగా అందులో చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఇక ఈ విషయం పై ఆసక్తికరంగా పీటీవీ నిన్న స్పందిస్తూ... "నౌమాన్ నియాజ్ మరియు షోయబ్ అక్తర్ ఇద్దరి మధ్య వివాదం పై విచారణకు ఆదేశించింది. అలాగే ఆ విచారం పూర్తయ్యే వరకు ఇద్దరినీ తమ ఛానెల్ లో అనుమతించకూడదని నిర్ణయించుకున్నట్లు" పేర్కొంది. అయితే ఈ ఈ ప్రకటనతో అక్తర్ విస్మయం చెందాడు.. ఎందుకంటే అతను ఇప్పటికే ప్రదర్శన నుండి తప్పుకున్నట్లు పేర్కొన్నాడు. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను 220 మిలియన్ల పాకిస్థానీలు మరియు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది సమక్షంలో రాజీనామా చేశాను. పీటీవీ..నన్ను ప్రసారం చేయడానికి వీళ్లు ఎవరు? పీటీవీకి పిచ్చి ఉందా... ఏమిటి? " పీటీవీ పై అక్తర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. షోలో హోస్ట్ తనతో ఘోరంగా ప్రవర్తించారని, ప్రసారంలో అవమానించారని అక్తర్ చెప్పాడు.
పీటీవీ  స్పోర్ట్స్ 'గేమ్ ఆన్ హై'లో మ్యాచ్ గురించి చర్చిస్తూ, షాహీన్ షా అఫ్రిది మరియు హరీస్ రవూఫ్‌లను ప్రశంసించాడు. దానికి హోస్ట్ నౌమన్ నియాజ్ అక్తర్ వ్యాఖ్యలపై అన్నాడు: "మీరు కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారు మరియు నేను ఈ విషయం గురించి ప్రశ్నించలేదు.. నేను అడిగిన వారికీ సమాధానం చెప్పండి. మీరు అతి తెలివి చుపించాలనుకుంటే షో నుండి మీరు వెళ్ళవచ్చు అని లైవ్ లో అన్నాడు. ఆ సమయంలో అక్కడ అతిథులుగా సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, రషీద్ లతీఫ్, ఆకిబ్ జావేద్ మరియు పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ సనా మీర్ వంటి గొప్పవారు ఉన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: