వింబుల్డన్‌లో జొకో, సబలెంకా ముందంజ

Sanjay
* సిట్సిపాస్‌, క్విటోవా అవుట్‌


స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో చెమటలు పట్టించిన సిట్సిపాస్‌ వింబుల్డన్‌లో అనూహ్యంగా ఫస్ట్‌ రౌండ్‌లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టాడు. పురుషుల్లో వరల్డ్‌ నెంబర్ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, మహిళల్లో రెండో సీడ్‌ సబలెంకా, స్పెయిన్‌ భామ గార్బినె ముగురుజా సెకండ్‌ రౌండ్‌లో అడుగుపెట్టారు. మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవాకు తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది. వర్షం కారణంగా తొలి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 16 రద్దయ్యాయి.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో గ్రీస్‌ ప్లేయర్‌ సిట్సిపాస్‌ 4-6, 4-6, 3-6తో ఫ్రాన్స్‌ టియాఫో (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 4-6, 6-1, 6-2, 6-2తో జాక్‌ డ్రేపర్‌ (బ్రిటన)పై నెగ్గి ముందడుగు వేశాడు. మ‌హిళ‌ల సింగిల్స్‌లో బెలార‌స్ భామ స‌బ‌లెంకా 6-1, 6-4తో మోనికా (రొమేనియా)పై, స్పెయిన్‌ సుంద‌రి గార్బినె ముగురుజా 6-0, 6-1తో ఫియానో (ఫ్రాన్స్‌)పై, అమెరికా క్రీడాకారిణి కీస్ 6-3, 6-4తో కేటీ స్వాన్‌పై గెలుపొందారు. చెక్ రిప‌బ్లిక్ కు చెందిన ప‌దో సీడ్ క్విటోవా 3-6, 4-6తో అమెరికాకు చెందిన స్లోన్ చేతిలో ఓట‌మి పాలైంది.ఇక‌, కొవిడ్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు అభిమానుల‌ను ప‌రిమిత సంఖ్య‌లోనే అనుమ‌తించారు.

 
వైదొలగిన జొహన్నా కొంటా
బ్రిటన్‌ ప్లేయర్‌ జొహన్నా కొంటా వింబుల్డన్‌ నుంచి తప్పుకొంది. ఆమె సహాయ సిబ్బందిలో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం క్లోజ్‌ కాంటాక్ట్‌గా ఉన్న 27వ సీడ్‌ కొంటా.. 10 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్టు ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ తెలిపింది. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో చెక్‌ ప్లేయర్‌ కేటరీనా సినికొవాతో జొహన్నా తలపడాల్సి ఉంది. అయితే, లక్కీ లూజర్‌గా కొంటా స్థానంలో 123వ ర్యాంకర్‌ యఫాన్‌ వాంగ్‌కు మెయిన్‌ డ్రాలో ఆడే చాన్స్‌ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: