క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

Suma Kallamadi
మనిషి ఏదో ఒక సమయంలో పొరపాటు చేయడం సహజమే. అయితే అతడు చేసిన పొరపాటు కు శిక్ష వెంటనే అనుభవించక పోయినా ఏదో ఒక సమయంలో ఆ శిక్ష అనుభవిస్తాడన్న సంగతి అందరికీ ఏదో ఒక పరిస్థితి వల్ల అర్థమయ్యే ఉంటుంది. ఇకపోతే ఇదే పరిస్థితి తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి ఓ భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీనికి కారణం తాజాగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్ ఓలి రాబిన్ సన్. తాజాగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై తొలి ఇన్నింగ్స్ లో నాలుగు కీలక వికెట్లు, అలాగే రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి మొదటి మ్యాచ్ లోనే సంచలన ప్రదర్శన చేశాడు.

అంతేకాదు ఇంగ్లాండ్ జట్టు నాకు కీలక సమయంలో తన బ్యాట్ తో కూడా 42 పరుగులను అందించి ఇంగ్లాండ్ పరువును నిలబెట్టాడు. నిజానికి మ్యాచ్ డ్రా కావడంలో ఇతనిది కీలకపాత్ర అని చెప్పవచ్చు. అయితే రాబిన్ సన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడే అవకాశం లేదని తాజాగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ తెలియజేసింది. ఇదివరకు 2012 సంవత్సరం సమయంలో అతను సోషల్ మీడియా వేదికగా జాతివివక్ష అలాగే మహిళల పట్ల వివక్షత పై కామెంట్ చేసినందుకు అతని పట్ల కోర్టులో కేసు నమోదయింది. అయితే ఆ సమయం సంబంధించిన కోర్టు కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆ కేసు పూర్తయ్యేవరకు రాబిన్ సన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడకూడదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ తెలియజేసింది.

ఈ సంఘటనతో ఇంగ్లాండ్ టీం ఒకింత షాక్ గురైంది. ఈ సంఘటనతో జూన్ 10 నుండి మొదలయ్యే న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ రెండో టెస్టుకు అతడు దూరం కాబోతున్నాడు. దీంతో అతడు వెంటనే ఇంగ్లాండ్ జట్టును వీడి తన కౌంటీ కి వెళ్ళిపోతడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. అయితే టీనేజర్ గా ఉన్న సమయంలో అతడు ముస్లిం కమ్యూనిటీని ఉగ్రవాదానికి ముడిపెడుతూ పెద్ద ఎత్తున పోస్ట్ చేయడంతో ఈ సమస్య తలెత్తింది. తొలిరోజు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత అతడు తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా తెలియజేశాడు. తాను అలాంటి పోస్టులు చేసినందుకు సిగ్గు పడుతుందట రాబిన్సన్ తెలియజేశాడు. తాను ఏ జాతికి వ్యతిరేకి కాదని అలాంటి ట్వీట్లు  చేయడం ఊహించుకోవడానికి ఎంతో బాధాకరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: