ప్రీక్వార్టర్స్‌కి చేరిన జ్వెరేవ్‌, మెద్వెదేవ్‌, కీ నిషికోరి..?

praveen
ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ లో రష్యన్ దేశస్థుడు డానియల్‌ మెద్వెదెవ్‌ అద్భుతమైన ఆట ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 2 టెన్నిస్ ప్లేయర్ గా నిలుస్తున్న ఆయన ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ లో గెలిచి నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. నోవాక్‌ జకోవిచ్‌ మొదటి స్థానాన్ని డానియల్‌ మెద్వెదెవ్‌ త్వరలోనే ఆక్రమించుకోవాలని రష్యా దేశీయులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. డానియల్‌ మెద్వెదెవ్‌ తాజాగా వరల్డ్ 35 ర్యాంకర్ అయిన రైలీ ఒపెల్కా ని చిత్తు చిత్తుగా ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ కి చేరుకున్నారు. శుక్రవారం రోజు జరిగిన టెన్నిస్ మ్యాచ్ లో డానియల్‌ మెద్వెదెవ్‌ 6-4, 6-2, 6-4 తేడాతో అమెరికా ఆటగాడు రైలీ ఒపెల్కా పై విజయం సాధించి నాలుగో రౌండ్ కి చేరుకున్నారు.
జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కూడా ప్రీ క్వార్టర్స్ కి చేరుకున్నారు. జ్వెరేవ్‌.. సెర్బియా ఆటగాడైన లాస్లో డెరె ను 6-2, 7-5, 6-2 తేడాతో ఓడించారు. జపాన్‌ ఆటగాడు కీ నిషికోరి కూడా ఫ్రెంచ్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ కి చేరుకున్నారు. అతడు స్విట్జర్లాండ్‌ ప్లేయర్ అయిన హెన్రీ లాక్‌సోనెన్‌ తో ఒక మ్యాచ్ ఆడారు కానీ హెన్రీ లాక్‌సోనెన్‌ మ్యాచ్‌ నుంచి కాలి గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయానికి నిషికోరి 7-5, 0-0తో ఆధిక్యంలో ఉండటంతో ఆయన ఫ్రీ క్వార్టర్స్ కి చేరుకున్నారు.
ఐతే ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, కీ నిషికోరి తలపడనున్నారు. ఇప్పటివరకు పారిస్ లో జరిగిన టెన్నిస్ గేమ్స్ లలో కీ నిషికోరి 4వ రౌండ్ కి 7 సార్లు చేరుకున్నారు. ఆయన తన కెరియర్ లో ప్రపంచ ఉత్తమ టెన్నిస్ ఆటగాళ్ల లో నాలుగో స్థానాన్ని కూడా చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: