ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అతడే : పాక్ క్రికెట్ దిగ్గజం

praveen

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజమైన  షోయబ్ అక్తర్ ప్రపంచ ఉత్తమ ఫాస్ట్ బౌలర్ ఎవరు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ తన దృష్టిలో మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ టీమ్ ఇండియాకు చెందిన మహ్మద్ షమి అని స్పష్టం చేశాడు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్. వేగం తెలివి భారత బౌలర్ మహ్మద్ షమి సొంతమని షోయబ్ అక్తర్ కొనియాడారు. హామిల్టన్ లో  జరిగిన టి20 మ్యాచ్ లో... ఆఖరి ఓవర్లో టైలర్ సిక్స్ కొట్టినప్పటికీ కూడా నిరాశ చెందకుండా వెనకడుగు వేయకుండా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన బంతులతో మ్యాచ్  భారత్ వైపు తిప్పిన ఘనత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కి దక్కుతుంది అంటూ ప్రశంసించారు.

 


 యార్కర్లు  సరైన ఫలితాలను ఇవ్వడం లేదని సత్వరంగా గ్రహించిన మహమ్మద్ షమీ  లెంత్ బాల్స్ వేస్తూ వాటికి బౌన్సర్లు జతచేస్తూ కివీస్ బ్యాట్స్ మెన్స్ అందరినీ కట్టడి చేశాడు అంటూ ప్రశంసలు కురిపించారు షోయబ్ అక్తర్. బ్యాటింగ్లో అపార అనుభవం న్యూజిలాండ్ బ్యాట్ మెన్ టేలర్ ను కూడా తన అద్భుతమైన బౌలింగ్తో మహమ్మద్ షమి బోల్తా కొట్టించిన వైనం మొత్తం  మ్యాచ్ లో  హైలైట్ గా నిలిచింది అంటూ కొనియాడారు షోయబ్ అక్తర్. ప్రపంచంలోనే ఉన్న క్రికెట్ జట్టు అన్నింటిలో  ఏ జట్టు లో కూడా ఇలాంటి ఫాస్ట్ బౌలర్ లేడు  అంటూ పేర్కొన్నారు.కాగా  క్లిష్ట పరిస్థితుల్లో కూడా మహమ్మద్ షమీ   తనదైన స్టైల్లో స్వింగ్ బౌలింగ్ చేస్తూ  వికెట్లు కూడా పడగొడుతున్నారు. 

 

 న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ టై  కావడంతో సూపర్ ఆడాల్సి ఉండగా ఈ సూపర్ బౌలింగ్  చేసిన షమీ  అద్భుతమైన అసామాన్య ప్రదర్శనతో అదరగొట్టేసాడు . మూడో టి20 గెలవడానికి షమీ  కారణం అని అనడంలో సందేహమే లేదు.టీమిండియా బ్యాట్స్మెన్ లు  కూడా ఈ మ్యాచ్ గెలవటానికి కారణం షమినెనని మ్యాచ్  విన్నింగ్ క్రెడిట్ మొత్తం మహమ్మద్ షమీ కి  ఇచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: