ఏ సమయాల్లో తులసి చెట్టుకు నీరు పోయకూడదో తెలుసా..?

Divya
మన హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తులసి చెట్టును ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి,గుమ్మం ఎదురుగా ఉంచుకొని ప్రతిరోజూ పూజిస్తూంటారు.దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని భావిస్తుంటారు.కానీ కొన్ని సమయాల్లో తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి.అలాంటి సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
సాయంత్రం..
తులసి చెట్టుకు పూజ చేసినప్పుడు ఉదయం మాత్రమే నీరు సమర్పించాలని, సాయంత్రం పూట నీరు వేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.దీనివల్ల తులసి మొక్క అపవిత్రంగా మారి ఎండిపోయే ప్రమాదం ఉందని వేద పండితులు హెచ్చరిస్తూన్నారు.
 రుతుక్రమణ సమయంలో..
రుతుక్రమణ సమయంలో ఆడవారెవరు తులసి దరిదాపులకు వెళ్ళకూడదని,అలా వెళ్లడం వల్ల,లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించే తులసి చెట్టు అపవిత్రంగా మారడంతో మన ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు సమిసిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఆదివారాలు..
తులసి మొక్కను లక్ష్మి దేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది.మన కుటుంబంలో సంతోషం , ఆరోగ్యం, పాజిటివిటీ పొందడానికి ప్రతిరోజూ ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించాలని పెద్దలు చెబుతుంటారు.కానీ ఆదివారంపూట తులసికి నీరు పోయకూడదు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తల్లి తులసికి ఎంతో ఇష్టమైన రోజు. కనుక అ రోజు తులసి తల్లి,విష్ణువు కోసం నిర్జ వ్రతాన్ని పాటిస్తుంది.ఒక వేళ మనం ఆదివారం నీటిని సమర్పిస్తే,ఆమె ఉపవాసం భంగం కలుగుతుందని నమ్ముతారు. దానితో ఆదివారం పూట తులసికి నీరు పోయకూడదు.
ఏకాదశి రోజు..
ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా భావించబడుతుంది, అంతే కాక తులసిదేవికి కూడా ఈ రోజు చాలా ప్రీతికరం.ప్రతి ఏకాదశి రోజున తులసిదేవి మహా విష్ణువు కొరకు నీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తుంది.కావున ఏకాదశి రోజున తులసిదేవికి నీరు సమర్పించకూడదని చెబుతారు.అలాగే తులసి ఆకులను కుడా తెంపకూడదు.ఇవిదంగా చేయడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని,జీవితంలో నెగిటివిటి వస్తుందని విశ్వాసిస్తారు. ఒక వేళ ఇలా తరచూ చేస్తే తులసి చెట్టు కూడా ఎండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: