మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే మీ ఇంటికి లక్ష్మి దేవీ రాబోతున్నట్టే..!

Divya
మనకు కలలు రావడం చాలా సహజం.అయితే ఆ కలలు ఉదయం పూట వచ్చే కలలు నిజం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ వాస్తవానికి కలల శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు కలలో కనిపించడం వల్ల మంచి ప్రయోజనాలు జరుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..కలలో తామర,ఏనుగు, కలశం, గుడిలో ఘంటలు వంటి వస్తువులు కనిపిస్తే, లక్ష్మిదేవీ అనుగ్రహం మీ పట్ల కలగబోతోంది అనడానికి నిదర్శనం అని కలల శాస్త్రం చెబుతోంది.
గుడి గంటలు:
రాత్రి పడుకున్నప్పుడు కలలో గుడి గంటలు శబ్దం వినిపిస్తే మీరు అత్యంత ముఖ్యమైన శుభవార్తలను వినబోతున్నారనే దానికి ముందు సూచన.ఆ శుభవార్త మీ జీవితంలో ని కష్టాలను కడతేరుస్తుందని అర్థం.
తామర:
మీ కలలో  లక్ష్మిదేవి ఆసనమైన కమలం కనిపిస్తే శుభ సంకేతంగా భావించాలి.ఇది మీ ఇంట్లోకి ధనసంపద వెల్లువలా రాబోతుందని అర్థం.
లక్ష్మీ దర్శనం:
మీరు మీ కలలో ధనానికి మూలమైన సాక్షాత్తు ఆ లక్ష్మిదేవీ కనిపిస్తే తొందరలో మీ ఆర్థిక సమస్యలు తొలగి,మీకు అదృష్టలక్ష్మి రాబోతుందని అర్థం . మీ వ్యాపారం వృద్ధి చెందబోతుందని అర్థం.
కలశం:
కలలో నీటితో నిండిన కలశం కానీ కుండ కానీ వస్తే అత్యంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.సంపదలు కలసి వచ్చి భూమి కొనుగోలు చేస్తారని అర్థం.
పక్షి గూడు:
కలలో పక్షి గూడు కనిపిస్తే మీ సంపద ధాన్యరూపంలో కలసి రాబోతుందని అర్ధం. పంటలు బాగా పండి వృద్ధిలోకి వస్తారన్న దానికి నిదర్శనం.
చీపురు:
హిందూసంప్రదాయం లో చీపురు లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు.ఉదయం పూట కలలో ఒక వ్యక్తి ఇళ్లు తుడుస్తున్నట్టు కనిపిస్తే తొందరలో మీ ఇంటికీ లక్ష్మిదేవీ రాబోతుందని అర్థం.
బల్లి లేదా పాము :
మీ కలలో తులసి కోట చుట్టూ బల్లి  కానీ పాము కానీ పాకుతున్నట్లు కనిపిస్తే సంపద, ఆనందం, శ్రేయస్సు పొందేందుకు సంకేతం. కలలో బల్లిని చూడటం పనిలో విజయం, అనుకోని ఆదాయం వచ్చి అప్పుల బాధలు తొలగుతాయని అర్థం.
ఆలయం లో పల్లకి :
మీకు కలలో గుడిలో పల్లకి, శంఖం,శివలింగం, దీపం లేదా తలుపు వంటివి కనిపిస్తే,ఆరోగ్యం,ఐశ్వర్యం, కలగజేస్తుందని అర్థం.
తెల్ల ఏనుగు :
 మీ కలలో తెల్ల ఏనుగును వస్తే అది రాజయోగంను , అధిక సంపదను , మంచి ఉద్యోగంను మీ జీవితంలో కి అడుగుపెడుతునట్టు అర్థం. అదేవిదంగా శ్రేయస్సును సూచిస్తుంది..కాబట్టి మీ కలలో ఈ వస్తువులు కనిపిస్తే మాత్రం లక్ష్మి కటాక్షం కలగబోతోందని అర్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: